- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పిల్లల పైనే కాదు.. పెద్దవారిపైన కూడా దాడి
దిశ, బోధన్ : పిచ్చి కుక్క దాడిలో ఓ మహిళతో పాటు ఐదేండ్ల పాప, ఏడాదిన్నర బాలుడు తీవ్ర గాయాలపాలైన ఘటన ఎడపల్లి మండలంలోని జానకంపేట్ గ్రామంలో చోటుచేసుకోంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జానకంపేట్ గ్రామానికి చెందిన బ్యాగరి సంపత్ భార్య సుజాత ఇంటివద్ద ఊడ్చే క్రమంలో పిచ్చికుక్క దాడి చేసి గాయపర్చింది. అంతేకాదు వారి ఏడాదిన్నర కుమారుడు ఇంట్లో గేటులోపల ఆడుకొంటుండగా అతనిపై కూడా పిచ్చి కుక్క దాడి చేసింది. అక్కడి నుంచి పారిపోయిన పిచ్చికుక్క అదే కాలనీలో ఇంటిబయట ఆడుకొంటున్న ఐదేండ్ల అన్వికను గాయపర్చింది.
దీంతో తీవ్ర గాయాలపాలైన బాలుణ్ణి, బాలికను, ఆ మహిళను కుటుంబ సభ్యుల నిజామాబాద్ లోని గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన పిచ్చికుక్కను కాలనీ వాసులు చంపేశారు. గ్రామంలో కుక్కల బెడద ఎక్కువైందని పెద్దలపైనే కాకుండా చిన్నపిల్లల పై దాడికి పాల్పడుతున్నాయని కాలనీ వాసులు పేర్కొంటున్నారు. గ్రామ పంచాయతీ చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవల పోచారం గ్రామంలో పిచ్చికుక్కలు ఎక్కువై గ్రామంలో అలజడులు సృష్టిస్తున్నాయని గ్రామస్తులు కుక్కలను సంహరించారు. పిచ్చికుక్కల బెడద నుంచి కాపాడుకొనేందుకు పోచారంలో గ్రామస్తులు అనుసరించిన చర్యలను జానకంపేట్ గ్రామంలో చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.