అక్రమార్కుల కోసమే అంధకారమా?

by Mahesh |
అక్రమార్కుల కోసమే అంధకారమా?
X

దిశ, కోటగిరి: ఉమ్మడి మండలం మొత్తం రాత్రి సమయాల్లో విద్యుత్ దీపాలతో వెలుగుతుంటే పోతంగల్ మండలం హెగ్డోలి గ్రామపంచాయతీ పరిధిలోని భాకర్ ఫారం లో మాత్రం అధికారులు ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే చెప్పవచ్చు. కరేగాం, సుంకిని, చేతన్ నగర్ మహా దేవుని గుట్ట గ్రామాల నుండి వచ్చే అక్రమ ఇసుక, మొరం రవాణాలకు సర్కిల్ పాయింట్‌గా ఉన్న కరేగాం ప్రభుత్వ పాఠశాల వద్ద అంధకారం అలుముకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ సర్కిల్ గుండా నిత్యం రాత్రి పగలు అనే తేడా లేకుండా పదుల సంఖ్యలో అక్రమంగా ఇసుక, మొరం తరలిస్తున్నారు. ఈ విషయం ఇటు రెవెన్యూ శాఖకు అటు పోలీసు శాఖ తెలిసినప్పటికి పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయలేకపోవడంపై అధికారుల కనుసన్నల్లోనే అక్రమ రవాణాలు జరుగుతున్నాయని చెప్పకనే తెలుస్తుంది. తూతూ మంత్రాంగా ఒకటి లేదా రెండు వాహనాలు పట్టుకొని మొక్కుబడిగా చిన్న పాటి జరిమానా విధించి పంపిస్తున్నారే తప్ప ఇప్పటి వరకు ఒక్క వాహనాన్ని కూడా మైనింగ్ శాఖకు అప్పగించిన దాఖలాలు లేవని చెప్పొచ్చు. ఈ పరిస్థితుల్లో అక్రమార్కులకు అనువుగా ఉండటం కోసం కొన్ని నెలలుగా అంధకారం అన్నట్లుగా కనిపిస్తుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి విధి దీపాలు ఏర్పాటు చేసి అక్రమ రవాణాను అరికట్టాలని గ్రామస్తులు కోరారు.

Next Story

Most Viewed