అన్నను సుత్తితో తలపై బాదిన తమ్ముడు

by Anjali |
అన్నను సుత్తితో తలపై బాదిన తమ్ముడు
X

దిశ, మాచారెడ్డి: అన్న తలపై తమ్ముడు సుత్తితో బాధడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లగా పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం గజ్యానాయక్ తండ కూడలిలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న సర్వేశ్‌ను.. అతడి తమ్ముడు కీషోర్ తల‌పై బాదాడు. తలకు తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలోకి చేరుకున్న సర్వేశ్‌ను మాచారెడ్డి ఎస్సై సంతోష్ కుమార్ కామారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు. సర్వేష్ మద్యానికి బానిసై ఇంట్లో ఘర్షణ పడడంతో ఈ ఘటనకు కారణమై ఉండవచ్చని ప్రాథమిక సమాచారం.

Advertisement

Next Story