స్పెషల్ ఆఫీసర్ నిర్వాకంపై విచారణ

by Mahesh |
స్పెషల్ ఆఫీసర్ నిర్వాకంపై విచారణ
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా డోంకేశ్వర్ మండలంలోని మారంపల్లి, దత్తాపూర్ గ్రామాల స్పెషల్ ఆఫీసర్ హనుమంత్ రెడ్డి పై బుధవారం విచారణ జరిగింది. జిల్లా ఆదన కలెక్టర్ (స్థానిక సంస్థలు)ఆదేశాల మేరకు ఆర్మూర్ డివిజన్ పంచాయతీ అధికారి శివకృష్ణ దత్తాపూర్ గ్రామంలో విచారణ జరిపారు. వెటర్నరీ వైద్యుడైన హనుమంత్ రెడ్డి మారంపల్లి, దత్తాపూర్ ల స్పెషల్ ఆఫీసర్‌గా ఇష్ట రాజ్యాంగ వ్యవహరించిన తీరుపై గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ నగరంలో తాను నిర్మిస్తున్న ఇంటికి నందిపేట్ మండల పరిషత్ కార్యాలయం వద్ద డంపు చేసిన ఇసుకను హనుమంత రెడ్డి తరలిస్తూ దొరికిపోయాడు. దత్తా పూర్ గ్రామానికి చెందిన జిపి ట్రాక్టర్ ను పంచాయతీ సెక్రటరీ సంబంధం లేకుండా, మండల పరిషత్ అధికారులకు సమాచారం ఇవ్వకుండా ఇసుకను డంపు నుంచి నిజామాబాద్‌కు తరలించే ప్రయత్నం చేశాడు.

స్పెషల్ ఆఫీసర్ ఆదేశాల మేరకు డ్రైవర్ భూమన్న, కారోబార్ లక్ష్మీనారాయణలు ఇసుకను ఆంధ్ర నగర్ లోని ఒక వ్యక్తి ఇంటికి తరలిస్తున్నామని తప్పుడు కాగితాలతో తరలిస్తుండగా పట్టుబడింది. ఈ విషయంపై బుధవారం జరిగిన విచారణలు డి ఎల్ పి ఓ కు డ్రైవర్, కారోబార్ లు తమ చేత ఇసుకను నిజామాబాద్ కు తరలించేందుకు ప్రయత్నించింది వాస్తవమేనని వాంగ్మూలం ఇచ్చారు. అదే మాదిరిగా దత్తాపూర్ గ్రామ కార్యదర్శికి ఈ విషయంలో ఎలాంటి సంబంధం లేదని గ్రామస్తులు మూకుమ్మడిగా డివిజనల్ పంచాయతీ అధికారికి వివరణ ఇచ్చారు. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న స్పెషల్ ఆఫీసర్ హనుమంత్ రెడ్డి అని మాకొద్దని గ్రామస్తులు డిఎల్పిఓకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు..

స్పెషల్ ఆఫీసర్‌ను కాపాడేందుకు రంగంలోకి కాంగ్రెస్ లీడర్లు..

ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా అధికార అన్ని అడ్డుపెట్టుకుని కొన్ని ఇష్టారాజ్యంగా వ్యవహరించిన స్పెషల్ ఆఫీసర్ హనుమంత్ రెడ్డి పై జిల్లా అధికార యంత్రాంగం విచారణకు ఆదేశించిన విషయం తెలిసింది. మొన్నటి వరకు ఈ విషయంలో తనను ఎవరూ ఏమీ చేయలేరు అన్న ధీమాతో ఉన్న స్పెషల్ ఆఫీసర్ హనుమంత్ రెడ్డి తర్వాత తనపై వేటుపడకుండా ఉండేందుకు అధికార పార్టీ నేతలకు శరణుదొచ్చినట్టు తెలిసింది. గెజిటెడ్ ఆఫీసర్ల సంఘంలో కీలక లీడర్ గా, రాష్ట్ర వెటర్నరీ వైద్యుల సంఘంలో ప్రముఖ ప్రధాన పాత్ర పోషిస్తున్న హనుమంత్ రెడ్డి ఈ వ్యవహారంలో తప్పించుకునేందుకు కాంగ్రెస్ నేతలను ఆశ్రయించినట్లు తెలిసింది. ఈ విషయంలో తనపై చర్యలు తీసుకోవద్దని జిల్లా అధికార యంత్రంపై ఒత్తిడి తెచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గ నేతలతో పాటు ఓక ఎమ్మెల్యే. ఓక ఎమ్మెల్సీని కలిసి తనపై వేటు పడకుండా చూడాలని కోరుతున్నట్లు మండలం లో చర్చ మొదలైంది.

Advertisement

Next Story