- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rowdy Sheeters : రెచ్చిపోతున్న రౌడీ షీటర్లు.. పెరిగిపోతున్న కత్తిపోట్ల కల్చర్..
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలో ఇటీవల కాలంలో కత్తిపోట్ల ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. రోజురోజుకు కత్తిపోట్ల కల్చర్ ( Culture ) పెరిగిపోతుండటం నగరవాసులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఎవరితో ఎప్పుడు, ఏ విషయంలో గొడవ మొదలవుతుందోనని.. ఈ గొడవ ఎటువైపు దారి తీస్తుందో తెలియని పరిస్థితులు దాపురిస్తున్నాయి. గొడవలు జరిగాయంటే కత్తులు, తల్వార్లే దర్శనమిస్తున్నాయి. ఎవరు ఎవరిని పొడుస్తారో, ఎన్ని పోట్లు పొడిచి ప్రాణాలు తీస్తారో అర్థం కాని పరిస్థితులు నెలకొంటున్నాయి. నిజామాబాద్ నగరంలో కత్తుల సంస్కృతి విచ్చల విడిగా పెరిగిపోతున్నా, ఇది వరకు జరిగిన సంఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోయినా, నిందితులకు జీవిత ఖైదు శిక్షలు పడినా మార్పు కనబడలేదు. సగటున ప్రతినెలలో నగరంలోని ఏదో ఒక మూలన కత్తిపోట్ల సంఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి.
తాజాగా నిజామాబాద్ నగరంలో సోమవారం పట్టపగలు నడిరోడ్డు పై జరిగిన కత్తిపోట్ల ఘటన తీవ్ర కలకలం రేపింది. నగరంలోని దుబ్బ ప్రాంతానికి చెందిన విశ్వనాథ్ ( Vishwanath ) అనే వ్యక్తిని అదే ప్రాంతానికి చెందిన భాస్కర్ అనే వ్యక్తిని బాకీ పడ్డ డబ్బుల విషయంలో తలెత్తిన గొడవ కారణంగా కత్తితో పొడిచి గాయపరిచాడు. ఇలాంటి ఘటనలు గతంలో ఎన్నో జరిగాయి. నగరంలో 2018 లో రైల్వేస్టేషన్ సమీపంలో గ్రౌండ్ లో జరిగిన డబుల్ మర్డర్ తీవ్ర సంచలనం రేపింది. ఒక రకంగా అప్పట్లో జరిగిన ఆ ఘటన తర్వాత నగరంలో తరచూ జరుగుతూనే ఉన్నాయి. అప్పటి ఘటనలో బద్రి పవన్, బద్రి నర్సింగ్ అనే ఇద్దరు అన్నదమ్ములను మొగుళ్ళ సాయి ప్రసాద్, మహేందర్, ధాత్రిక సంజయ్ లనే ముగ్గురు వ్యక్తులు తల్వార్లతో అత్యంత పాశవికంగా నరికి చంపారు. ఈ కేసులో ముగ్గురు నిందితులకు కోర్టు జీవిత ఖైదు విధించింది.
ఇటీవల జరిగిన మరికొన్ని ఘటనలు...
జూన్ 21న బోధన్ బస్టాండులో శుక్రవారం తెల్లవారుజామున జన్నెపల్లి ( Jannepally ) ఎక్స్ రోడ్ లో జరిగిన కత్తిపోట్లలో షేక్ మెహబూబ్ ను నిజామాబాద్ నగరానికి చెందిన ఓ వ్యక్తి బండ రాళ్లతో కొట్టి చంపారు.
మార్చి 30న బోర్గాం (పి) శివారులో రెండు వర్గాల మధ్య జరిగిన గొడవలో శంకర్ అనే వ్యక్తితో పాటు అతని తల్లి పై వారి బంధువులు కత్తితో దాడి చేసి గాయపరిచారు.
జూన్ 2 న నాగారంలో కూడా కత్తిపోట్ల ఘటన జరిగింది. అహ్మద్ పుర ( Ahmed Pura ) కాలనీలో సోహైల్ అనే వ్యక్తిని ఆయన తరఫు బంధువులు కుటుంబ కలహాల కారణంతో కత్తితో పొడిచారు.
ఏప్రిల్ 22న నగర శివారులోని అర్సపల్లి ఎక్స్ రోడ్ పోలీస్ అవుట్ పోస్టు ప్రాంతంలో ఓ యువకుడు అందరూ చూస్తుండగా అక్రం అనే వ్యక్తి ఫారూఖ్ అనే వ్యక్తిని కత్తితో పొడిచి తీవ్రంగా గాయపరిచాడు.
సెప్టెంబర్ 19న సంజీవయ్య కాలనీలో కూడా కత్తిపోట్ల ఘటన చోటు చేసుకుంది.
జూన్ 25న నిజామాబాద్ నగరంలోని బస్టాండు ప్రాంతంలో బస్ దిగి రోడ్డు పై నడుస్తూ వెళుతున్న ఓ వ్యాపారి పై ఇద్దరు వ్యక్తులు బ్లేడ్ తో దాడి చేసి మొబైల్ ఫోన్ ఎత్తుకెళ్లారు.
జూన్ 25 న ధర్మపురి హిల్స్ లోని దర్గా వద్ద షేఖ్ హసన్ అనే వ్యక్తి పై కూడా కత్తితో దాడి జరిగిన ఘటన చోటు చేసుకుంది.
జూన్ 6న డెయిరీ ఫాం కు చెందిన అద్నాన్, రేహాన్ మధ్య తలెత్తిన ఘర్షణ కత్తిపోట్ల దాకా వెళ్లింది.
పోలీసుల ఉదాసీన వైఖరే..
నగరంలో కత్తిపోట్ల కల్చర్ ను కట్టడి చేయడంలో పోలీసు అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుశాఖ ఉదాసీనంగా వ్యవహరించడం కారణంగానే ఈ ఘటనలు తరచూ జరుగుతున్నాయనే ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. కొందరు రౌడీ షీటర్లకు రాజకీయ నేతల అండదండలున్నాయని, ఈ కారణంగా పోలీసులను, కేసులను కూడా లెక్కచేయడం లేదని కొందరు పోలీసు అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాజకీయ నాయకులు వారి స్వలాభం కోసం రౌడీషీటర్లను కాపాడుతున్నారని, నగరంలో క్రైం రేటును అరికట్టేందుకు, క్రిమినల్స్ భయాన్ని పుట్టించేందుకు పోలీసులు చర్యలు తీసుకున్న ప్రతిసారి పొలిటికల్ పవర్ తో ప్రెషర్ పెట్టిస్తున్నారని తెలుస్తోంది. అందుకే నగరంలో కత్తిపోట్ల కల్చర్ వేళ్లూనుకుపోతోందని, సాధారణ జనాన్ని భయాందోళనకు గురిచేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నగరంలో ప్రశాంత్ వాతావరణం నెలకొల్పేందుకు, క్రైం రేటును తగ్గించేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలకు రాజకీయ నేతలు కూడా సహకరించాల్సిన అవసరముందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.