నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బోర్డు ను వెంటనే రద్దు చేసి అన్యాయమైన విద్యార్థులకు న్యాయం చేయాలి…

by Kalyani |
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బోర్డు ను వెంటనే రద్దు చేసి అన్యాయమైన విద్యార్థులకు న్యాయం చేయాలి…
X

దిశ, నిజామాబాద్ సిటీ: ఉమ్మడి ఐక్య విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు నీట్ విద్యార్థుల తో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జాతీయ కౌన్సిల్ మెంబర్ బానోత్ రఘురామ్, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు నరేందర్ మాట్లాడుతూ…కేంద్ర ప్రభుత్వం అధీనం లో నడుస్తున్న ఎన్టీఎ బోర్డు ను వెంటనే రద్దు చేసి సిట్టింగ్ జడ్జి చే విచారణ జరిపించి 24 లక్షల మంది నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పెదవి విప్పి సమస్యను పరిష్కరించాలని అన్నారు.

అదే విధంగా కేంద్రం నిష్పక్షపాతంగా వ్యవహరించి రీ - పరీక్ష ను నిర్వహించాలని కోరారు. తప్పు చేసిన కోచింగ్ సెంటర్ల ను శాశ్వతంగా నిషేధించి పేపర్ లీకేజీ లకు పాల్పడిన వారిని చట్టపరంగా శిక్షించాలని అన్నారు. బాధిత నీట్ విద్యార్థులకు న్యాయం చేయకపోతే బీజేపీ పాలిత ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటి ముట్టడికి వెనకడం అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విఘ్నేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు అంజలి, పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి డాక్టర్ కార్క గణేష్, పీడీఎస్యూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గౌతమ్, జన్నారపు రాజేశ్వర్, ఏఐపీఎస్యూ జిల్లా కార్యదర్శి బోడ అనిల్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మహేష్, నాయకులు దీపిక, కుషాల్, గణేష్, సాయి, సందీప్, చోటు, టోకు తదితర నాయకులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed