ప్రబలుతున్న విష జ్వరాలు.. పారిశుద్ధ్య లోపమే అంటున్న కాలనీవాసులు

by Aamani |
ప్రబలుతున్న విష జ్వరాలు.. పారిశుద్ధ్య లోపమే అంటున్న కాలనీవాసులు
X

దిశ,పిట్లం : పిట్లం మండలంలోని పలు కాలనీలలో రోజురోజుకు విష జ్వరాలు పెరిగిపోతున్నాయి. ప్రతి ఇంట్లో ఒకరు విష జ్వరాల బారిన పడుతున్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో గ్రామపంచాయతీ నిర్లక్ష్యం కారణంగానే దోమలు విపరీతంగా పెరిగి విష జ్వరాల బారిన పడుతున్నట్లు పిట్లం నేతాజీ నగర్, హరిజనవాడ కు చెందిన పలువురు ఆరోపిస్తున్నారు. పారిశుద్ధ్య విషయంలో ఎన్ని పర్యాయాలు గ్రామ పంచాయతీ సెక్రటరీకి విన్నవించినప్పటికీ పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం కాలనీలలో శానిటైజేషన్ కోసం వేల రూపాయలు వెచ్చించి ఫాగింగ్ మిషన్లు కొనుగోలు చేసినప్పటికీ గ్రామ పంచాయతీ అధికారులు వినియోగించకపోవడం పంచాయతీలలో అలంకార ప్రయాణం గా మారాయాని అంటున్నారు. విధిగా గ్రామ పంచాయతీ అధికారులు వారంలో ఒక్కసారైనా ప్రతి కాలనీలలో ఎప్పటికప్పుడు ఫాగిన్ చేయాల్సి ఉన్నప్పటికీ అలా చేయకపోవడమే దోమలు పెరుగుదలకు కారణమైనట్లు వారు తెలుపుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కాలనీలకు చెందిన ప్రతి ఒక్కరు కోరుతున్నారు.

ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు : దుసలి, సాయ గౌడ్, నేతాజీనగర్ కాలనీ

నేతాజీ నగర్ నందు మురికి కాలువలు నిండిపోయి దుర్వాసన వెదజల్లుతున్నాయని, దోమల బెడద ఎక్కువైతుందని గ్రామ పంచాయతీ సెక్రెటరీ ఎన్ని పర్యాయాలు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి.

అందరం విష జ్వరాల బారిన పడుతున్నాం : మహమ్మద్ అజీమ్, హరిజనవాడ

దళితవాడలో చెత్తా చెదారం పేరుకుపోయి విష జ్వరాల పాడిన పడుతున్నాం. చెత్తను తొలగించాలని గ్రామ పంచాయతీకి వెళ్లి ఎన్ని పర్యాయాలు ఫిర్యాదు చెప్పినప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కనీసం శుభ్రం చేయడానికి రావడం లేదు ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకుని కాలనీలో విష జ్వరాలను ప్రబలకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement

Next Story

Most Viewed