ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్..

by Sumithra |
ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్..
X

దిశ, కామారెడ్డి : జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్ వాన్ బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని పలు విభాగాలను కలియతిరిగి రోగులతో మాట్లాడి వైద్యులకు తగు సూచనలు చేశారు. ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా సూపరిండెంట్ డాక్టర్ రామ్ సింగ్ కు పలుసూచనలు చేశారు. తర్వాత రోగులకు సంబంధించి అవసరాల నిమిత్తం ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకువస్తే దాని తొందరలోనే చర్చించి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దామని చెప్పారు. ఈ మధ్యలో జరిగినటువంటి చిన్న చిన్న రిపేర్లు అన్ని కూడా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కూడా కచ్చితంగా ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా జిల్లా జనరల్ ఆస్పత్రిలో మెడికల్ కాలేజ్ వారి ఆధ్వర్యంలో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని, దానికి అవసరమైనటువంటి అన్ని రకాల సహాయ సహకారాలు జిల్లా కలెక్టర్ గా అందిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ విజయలక్ష్మి, డీఎంహెచ్వో డాక్టర్ చంద్రశేఖర్, డిప్యూటీ సూపర్ఇండెంట్లు డాక్టర్ ఆఫీస్ ఘోరీ, డాక్టర్ బన్సీలాల్, వివిధ విభాగాల వైద్యులు పాల్గొన్నారు.

మాతృ మరణాల నివారణకు కృషి చేయాలి..

మాతృ మరణాలు జరగకుండా సమర్థవంతంగా వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి మాతృ మరణాల పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చిన ఈ కాలంలో ప్రసవ సమయంలో మాతృ మరణాలు సంభవించకుండా జాగ్రత్త పడడం వైద్యాధికారుల కర్తవ్యమన్నారు. మాతృ మరణాలు జరుగకుండా ఏఎన్ఎమ్ స్థాయి నుండి వైద్యాధికారి, జిల్లా స్థాయిలో ఎంసీహెచ్ ప్రోగ్రాం అధికారి వరకు అందరూ బాధ్యతతో ఉండాలని, నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డా.చంద్రశేఖర్, ఎంసీహెచ్ ప్రోగ్రాం అధికారి డా.శోభారాణి, డీసీహెచ్ఎస్ డా.విజయలక్ష్మి, సంబంధిత వైద్యాధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Next Story

Most Viewed