- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్వదేశానికి చేరిన మహమ్మద్ యూనస్ మృతదేహం
దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లాలోని సిరికొండ మండలం తాళ్ల రామడుగు చెందిన 24 ఏళ్ల యువకుడు మహమ్మద్ యూనస్ ఉపాధి కోసం ఖతర్ దేశంలోని దోహా కు వెళ్లాడు. ఐదు రోజుల కిందట అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో దురదృష్టవశాత్తు అతడు దుర్మరణం పాలయ్యాడు. మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి తీసుకురావాలన్న యువకుడి కుటుంబ సభ్యుల విన్నపం మేరకు వలస దారుల హక్కులు సంక్షేమ సంఘం ఫోరం అధ్యక్షుడు కోటపాటి నరసింహనాయుడు ఖతర్ లోని ఇండియన్ ఎంబసీ ఫోరం దృష్టికి తీసుకెళ్లాడు.
దీంతో శుక్రవారం శంషాబాద్ విమానాశ్రయానికి యూనస్ మృతదేహం వచ్చింది. అక్కడి నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందూరు జిల్లాలోని సిరికొండ మండలం తాళ్లరామడుగు వరకు ఉచిత ఆంబులెన్స్ సదుపాయాన్ని ఏర్పాటు చేయగా ఆ అంబులెన్స్ లో ఆ యువకుడు మృతదేహాన్ని స్వగ్రామానికి కోటపాటి శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి తరలించారు. ఎన్నారై సెల్ చిట్టిబాబుకు, ఎం.ఆర్.డబ్ల్యూ.ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కోటపాటి నరసింహనాయుడు, సిరికొండ మండలం ఎం.ఆర్.డబ్ల్యూ.ఎఫ్ అధ్యక్షుడు మహేందర్ యాదవ్ లకు యువకుడి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.