- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బాధిత కుటుంబానికి బాసటగా ఆర్యవైశ్య సంఘం
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : వడ్డీ వ్యాపారుల వేధింపుల కారణంగా ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడగా అదృష్టవశాత్తు బతికి బయటపడిన విషయం తెలిసిందే. బాధితురాలిని ఆర్యవైశ్య సంఘం పరామర్శించింది. ఆమెకు బాసటగా ఉంటామని భరోసానిచ్చింది. గురువారం ఆర్యవైశ్య సంఘం సభ్యులు బాధితురాలు ఇంటికి వెళ్లి ఆమెతో మాట్లాడారు. వడ్డీ వ్యాపారుల వేధింపులపై ఆమె ఆర్యవైశ్య సంఘం సభ్యులకు రోధిస్తూ వివరించింది.
ఆ కుటుంబానికి జరిగిన నష్టాన్ని పూడ్చలేకపోయినా ఆర్యవైశ్య సంఘం మీకు బాసటగా నిలుస్తుందని బాధితురాలికి సంఘం సభ్యులు హామీ ఇచ్చారు. ధైర్యంగా ఉండాలని ఆమెకు సూచించారు. వడ్డీ వ్యాపారుల ఆగడాలు మితిమీరాయని, వారిని నియంత్రించకపోతే అమాయక కుటుంబాలెన్నో వీధిన పడే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీస్ ఉన్నతాధికారులు ఈ విషయంలో స్పందించి చర్యలు తీసుకోవాలని ఆర్య వైశ్య సంఘం నాయకులు కోరారు.