దేశంలో 24 గంటల విద్యుత్ అందిస్తున్న రాష్ర్టం తెలంగాణ : ఎమ్మెల్యే గణేష్ గుప్తా

by Shiva |
దేశంలో 24 గంటల విద్యుత్ అందిస్తున్న రాష్ర్టం తెలంగాణ : ఎమ్మెల్యే గణేష్ గుప్తా
X

దిశ, నిజామాబాద్ సిటీ : దేశంలో 24 గంటల విద్యుత్ అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని ఎమ్మెల్యే గణేష్ గుప్తా అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం విద్యుత్ ప్రగతి ఉత్సవాన్ని నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం పరిధిలో పవర్ హౌస్ కాంపౌండ్ పరిధిలోని గోల్డెన్ జూబ్లీ మీటింగ్ హాల్లో అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా అర్బన్ ఎమ్మెల్యే అధ్యక్షతన నిర్వహించారు.

ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, మేయర్ దండు నీతు కిరణ్, నూడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు జరిగిన అన్యాయం రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ లో రాష్ట్రంలో సాధించిన ప్రగతిని వీడియో రూపంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ గుప్తా మాట్లాడుతూ.. కందిళ్లు, బిజిలీలు, లాంతర్ల, నుంచి ఈ రోజు 24 గంటల విద్యుత్ ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని తెలిపారు.

ఈ రోజు ఇన్వర్టర్లు, జనరేటర్లతో పని లేకుండా పోయిందన్నారు. రాష్ట్రానికి ఐటీ కంపెనీలు పెద్ద ఇండస్ట్రీలు తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిని చూసి హైదరాబాద్ వస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో తోట రాజశేఖర్, సుధాం లక్ష్మీ మహిళా కమిషన్ సభ్యులు, బీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ సిర్ప రాజు, శ్రీనివాస్ రావు డీఈ, నగర కార్పొరేటర్లు, విద్యుత్ శాఖ అధికారులు డీఈ లు ఎం శ్రీనివాసరావు, వెంకటరమణ ప్రభాకర్, ఏడీలు వేరేశం, గంగారాం నాయక్, రవి కిషోర్, రఘునందన్ శివాజీ గణేష్, జాకీర్ అలీ సాబ్, డి.శ్రీనివాస్, ఆర్.సుమిత, రామ్ సింగ్, గంగా శేఖర్, అన్నయ్య, ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed