- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కొత్త కలెక్టరేట్ లో ఘనంగా తెలంగాణ సుపరిపాలన దినోత్సవం..
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమానికి పాటుపడుతూ ప్రగతి పథంలో అగ్రగామిగా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్రం అందరికీ ఆదర్శంగా మారిందని వక్తలు కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శనివారం నిజామాబాద్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ అధ్యక్షతన తెలంగాణ సుపరిపాలన దినోత్సవం నిర్వహించారు. జెడ్పి చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, శాసన సభ్యులు బిగాల గణేష్ గుప్తా, ఆశన్నగారి జీవన్ రెడ్డి, నగర మేయర్ నీతూ కిరణ్ తదితరులు విచ్చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం పాలనాపరంగా చేపట్టిన మార్పులు, నూతన సంస్కరణలతో సాధించిన ఫలితాలు, క్షేత్రస్థాయి వరకు ప్రజలకు చేరువైన పాలన, చేకూరుతున్న లబ్ది తదితర వివరాల గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.
ఈ సందర్భంగా జెడ్పీచైర్మన్ విఠల్ రావు మాట్లాడుతూ స్వరాష్ట్రంలో సామాన్య ప్రజానీకానికి పాలనను చేరువ చేస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార వికేంద్రీకరణతో అద్భుత ఫలితాలు సాధించారని అన్నారు. పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు అని జాతిపిత మహాత్మా గాంధీ చెప్పిన సూక్తిని అక్షారాలా ఆచరిస్తూ తెలంగాణలోని ప్రతి పల్లెను పల్లె ప్రగతి ద్వారా అభివృద్ధి చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు. శాసన సభ్యులు బిగాల గణేష్ గుప్తా, జీవన్ రెడ్డిలు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వ సాహసోపేత నిర్ణయాలు, ప్రభుత్వ ఉద్యోగుల కృషితో తెలంగాణ ప్రగతి పథాన అగ్రభాగాల్లో పయనిస్తుందన్నారు. రాష్ట్రంలో జోడెడ్ల బండిలా జోరుగా అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతోందని అన్నారు.
సీఎం కేసీఆర్ దార్శనికతతో సుపరిపాలన సాగుతోందని, సమైక్య రాష్ట్రంలో దుర్భిక్ష పరిస్థితులు నెలకొని ఉండగా, స్వరాష్ట్రంలో తెలంగాణ సుభిక్షంగా మారిందన్నారు. సాగునీటి ప్రాజెక్టులు, సచివాలయం, నూతన కలెక్టరేట్ భవనాలు, రోడ్ల నిర్మాణాలు, చెరువుల పునరుద్ధరణ, ఇంటింటికీ నల్లాల ద్వారా మంచినీటి సరఫరా, 24గంటల విద్యుత్ సరఫరా, రైతుబంధు, రైతుబీమా, కల్యాణ లక్ష్మీ వంటి పథకాలు, కార్యక్రమాల ద్వారా తెలంగాణ ప్రభుత్వం సరికొత్త చరిత్ర సృష్టించిందని హర్షం వ్యక్తం చేశారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ సుపరిపాలన ఫలితంతో ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం పెరిగినా, రాష్ట్రంలో సగటున పౌరుల తలసరి ఆదాయం వృద్ధి చెందిందని అన్నారు. అధికార వికేంద్రీకరణతో పాలనా సౌలభ్యం ఏర్పడిందని, ప్రజలకు పాలన ఎంతో చేరువయ్యిందన్నారు.
వివిధ శాఖల్లో కొత్తగా ఉద్యోగాలను భర్తీ చేసుకునే వెసులుబాటు లభించిందన్నారు. ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ధరణి, టీఎస్-ఐపాస్ వంటి కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు. ఆధునిక సాంకేతికతను ఉద్యోగులు అందిపుచ్చుకుని ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, అదనపు కలెక్టర్ చిత్రమిశ్రా, సీపీఓ బాబురావు, టీ ఎన్ జీ ఓ సంఘం జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.