ఉద్యమకారుడికి సీఎం కేసీఆర్ ఫోన్..

by Vinod kumar |
ఉద్యమకారుడికి సీఎం కేసీఆర్ ఫోన్..
X

దిశ, తాడ్వాయి: తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమంలో కాళ్లకు గజ్జలు కట్టి.. ఆట పాటలతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తన గళంతో ప్రజల హృదయాలను కదిలించిన వ్యక్తి తాడ్వాయి మండలం ఏండ్రియల్ గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు విఠల్ రెడ్డి కి తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం ఫోన్ ద్వారా మాట్లాడినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన దిశతో మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ కాలం నాటి జ్ఞాపకాలను గుర్తు చేశారని, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉద్యమం ఉవ్వెత్తున నడిచిన సమయంలో కళాకారులు వెన్నంటే ఉన్న గుర్తులను నెమరు వేసుకున్నారు.

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు గురించి తెలుసుకోవడం జరిగిందన్నారు. ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో తెలంగాణ కళాకారుల బృందానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు అయన తెలిపారు. తెలంగాణ సిద్ధించి కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కళాకారులకు తగిన గుర్తింపు లభిస్తుందని ఆయన అన్నారు. దీంతోపాటు ఆరోగ్య పరిస్థితిలను అడిగి తెలుసుకున్నారని ఆయన తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed