గాంధీభవన్‌లో మంత్రి పొన్నం ముఖాముఖీ.. 179 అప్లికేషన్లు

by Mahesh |
గాంధీభవన్‌లో మంత్రి పొన్నం ముఖాముఖీ.. 179 అప్లికేషన్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: గాంధీభవన్ లో ఏర్పాటు చేస్తున్న మంత్రులతో ముఖాముఖీ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. బుధవారం కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. వివిధ సమస్యలపై 179 అప్లికేషన్లు వచ్చినట్లు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. ఇందులో ట్రాన్స్ పోర్టు శాఖకు సంబంధించి 42 ఉండగా, మిగతా వాటిని వివిధ శాఖలకు రిఫర్ చేసినట్లు గాంధీభవన్ స్టాఫ్​ వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ...తెలంగాణ ప్రభుత్వం పక్షాన రవాణా శాఖ మంత్రి గా కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ కార్యకర్తల సమస్యల పై విజ్ఞాపనలు వినడానికి వచ్చినట్లు వెల్లడించారు.

కార్యకర్తలు, ప్రజలు సంక్షేమంపై తమ ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. ఇందిరమ్మ ఇళ్లు త్వరగా ప్రారంభించాలని ప్రజల నుంచి విజ్ఞప్తులు అందాయని, త్వరలోనే అందజేస్తామన్నారు. ఇక రేషన్ కార్డులు డిజిటల్ పైలట్ ప్రాజెక్ట్ జరుగుతుందని, అర్హులందరికీ ఇస్తామన్నారు. ఉద్యోగాల నియామకాల ప్రక్రియను వేగవంతం చేస్తున్నామన్నారు.విద్యా ,వైద్యం, ఉపాధి అవకాశాలు అన్ని రంగాల్లో తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. కానీ బీఆర్ ఎస్ నేతలు 10 నెలలు కూడా కానీ ప్రభుత్వం మీద అనేక విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. త్వరలోనే బీఆర్ ఎస్ ను బూడిద చేసే కార్యక్రమం ఉన్నదని పొన్నం చురకలు అంటించారు.

Advertisement

Next Story