Mercedes-Benz: ఇండియాలో పెరిగిన బెంజ్ కార్ల విక్రయాలు.. ఎంత శాతం వృద్ధి నమోదు చేసిందంటే..?

by Maddikunta Saikiran |
Mercedes-Benz: ఇండియాలో పెరిగిన బెంజ్ కార్ల విక్రయాలు.. ఎంత శాతం వృద్ధి నమోదు చేసిందంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్:దేశంలోని అతిపెద్ద లగ్జరీ కార్ల(Luxury cars) తయారీ కంపెనీ, జర్మనీ(Germany)కి చెందిన మెర్సిడెస్ బెంజ్(Mercedes-Benz) కార్ల అమ్మకాలు భారత్(India)లో జోరుగా పెరిగాయి. ఈ ఏడాది మొదటి 9 నెలల్లో 13 శాతం వృద్ధి(13 Percent Growth)తో దాదాపు 14,379 కార్లను విక్రయించింది. గత నెలలో ఈ కంపెనీ 5,117 కార్ల అమ్మకాలను నమోదు చేసింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఇయర్ అమ్మకాలు 21 శాతం పెరిగాయి. జనవరి నుంచి ఏప్రిల్ మధ్య మెర్సిడెస్ బెంజ్ దాదాపు 800 విద్యుత్ కార్ల(Electric Cars)ను విక్రయించింది. గతేడాదితో పోలిస్తే విద్యుత్ కార్ల అమ్మకాలలో 84 శాతం వృద్ధిని నమోదు చేసింది. అదే విధంగా టాప్ వేరియంట్ కార్ల అమ్మకాలు 18 శాతం మేర పెరిగాయని మెర్సిడెస్ బెంజ్ తెలిపింది. ఇక ఈ ఏడాది చివరి నాటికి భారతదేశంలో 12 కొత్త కార్లను విడుదల చేయాలని ఆ సంస్థ భావిస్తోంది. ఆ దిశగా కార్యాచరణ కూడా ప్రారంభించింది.అలాగే వచ్చే ఆరు నెలల్లో ఎలక్ట్రిక్ కార్లతో పాటు పాపులర్ మోడల్లైన ఏఎంజి, మేబాక్(AMG, Maybach) వెర్షన్లతో సహా మరో ఐదు మోడళ్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.

Advertisement

Next Story