- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బంగ్లాదేశ్ పై భారత్ భారీ విజయం.. టీ20 సిరీస్ కైవసం
దిశ, వెబ్‌డెస్క్: భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టీ20లో భారత్ భారీ విజయం సాధించింది. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన భారత్ మొదట బ్యాటింగ్ చేసింది. యువ బ్యాటర్లు ఈ మ్యాచులో బంగ్లా బౌలర్లపై ఫోర్లు సిక్సర్లతో విరుచుకు పడ్డారు. నితీష్ కుమార్ రెడ్డి 74, రింకు సింగ్ 53, పాండ్యా 15, అభిషేక్ శర్మ 15, రియాన్ పరాగ్ 15 పరుగులు చేశారు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. బంగ్లా భౌలర్లలో టస్కిన్ అహ్మద్, హసన్ షకీబ్, ముస్తాఫిజుర్ రెండేసి వికెట్లు తీసుకోగా రిషాద్ హుస్సేన్ 3 వికెట్లు తీసుకున్నాడు. అనంతరం 222 పరుగుల భారీ లక్ష్యంతో చేజింగ్ కు దిగి బంగ్లా బ్యాటర్లు వెంట వెంటనే అవుట్ అవుతూ చేతులెత్తేశారు. ముఖ్యంగా భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేక వచ్చినవాళ్లు వచ్చినట్లే అవుట్ కావడంతో భారత్ పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. బంగ్లా బ్యాటర్లలో మహ్మదుల్లా మినహా ఎవరూ సరిగ్గా రాణించక పోవడంతో బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 195 పరుగులు మాత్రమే చేసింది. దీంతో భారత్ 86 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి మూ టీ20ల సిరీస్ ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. అలాగే ఈ మ్యాచులో భారీ సిక్సర్లు, ఫోర్లతో 74 పరుగులు చేసిన యువ బ్యాటర్ నితీష్ కుమార్ రెడ్డి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.