Foxconn: తమిళనాడులో ఫాక్స్‌కాన్ రూ.13,180 కోట్ల భారీ పెట్టుబడులు..ఆమోదం తెలిపిన ఆ రాష్ట్ర కేబినెట్‌

by Maddikunta Saikiran |   ( Updated:2024-10-09 16:58:40.0  )
Foxconn: తమిళనాడులో ఫాక్స్‌కాన్ రూ.13,180 కోట్ల భారీ పెట్టుబడులు..ఆమోదం తెలిపిన ఆ రాష్ట్ర కేబినెట్‌
X

దిశ, వెబ్‌డెస్క్:ప్రముఖ దిగ్గజ ఎలక్ట్రానిక్స్‌ తయారీ సంస్థ ఫాక్స్‌కాన్(Foxconn) ఇండియా(India)లో మరో భారీ పెట్టుబడుల(Huge Investments)ను పెట్టనుంది. తమిళనాడు(Tamil Nadu)లోని కాంచిపురం(Kanchipuram)లో రూ.13,180 కోట్లతో యాపిల్ మొబైల్ ఫోన్(Apple Mobile Phone) విడిభాగాల తయారీ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. సీఎం స్టాలిన్‌(CM Stalin) అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్‌ సమావేశంలో(Cabinet Meeting) ఫాక్స్‌కాన్ పెట్టుబడులకు ఆమోదముద్ర వేశారు. ఇక 38,699 కోట్ల పెట్టుబడితో మరో 13 కొత్త పరిశ్రమల స్థాపనకు ఆ రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. డిఫెన్స్‌, ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డులు, రెనెవబుల్‌ ఎనర్జీ, ఫార్మా, నాన్‌ లెదర్‌ ఫుట్‌వేర్‌, టెలికాం రంగాల్లో ఈ పెట్టుబడులు రానున్నాయని పేర్కొంది. తమ రాష్ట్రంలో ఏర్పాటయ్యే కొత్త పరిశ్రమలతో సుమారు 46,931 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేబినెట్‌ వెల్లడించింది. అలాగే తమిళనాడులోని రాణిపేట్‌(Ranipet)లో టాటా మోటార్స్‌(Tata Motors) పరిశ్రమ రాబోతుందని ఆ రాష్ట్ర కేబినెట్ తెలిపింది.

Advertisement

Next Story