'తీజ్ పండుగ'.. ఇది బంజారా, లంబాడాల సంస్కృతికి ప్రతిరూపం

by Geesa Chandu |
తీజ్ పండుగ.. ఇది బంజారా, లంబాడాల సంస్కృతికి ప్రతిరూపం
X

దిశ, వెబ్ డెస్క్: డప్పు చప్పుళ్లు, ఆటపాటలు, వివిద సాంప్రదాయ నృత్యాలు... ఇందూర్ గడ్డ మీద ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే సందడి వాతావరణం నెలకొంది. చిన్నాపెద్దా బేధాలు లేకుండా అందరూ తీజ్ పండుగ ఉత్సవాల్లో సంబరాలు చేసుకుంటున్నారు. ప్రకృతి దేవతను ఆరాధిస్తూ.. మొలకల వేడుకను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. పెళ్ళికాని కన్యలు మట్టిలో విత్తనాలు నాటి, భక్తిశ్రద్ధలతో తొమ్మిది రోజుల పాటూ జరుపుకునే పండుకే ఈ తీజ్ వేడుక.

మట్టిలో నాటిన విత్తనాలకు నీటిని పోస్తూ.. తొమ్మిది రోజులపాటూ నియమ నిష్టలతో ఉపవాస దీక్షలు చేస్తారు. తండావాసులు చివరి దినములో అనగా తొమ్మిది రోజుల తర్వాత మొలకెత్తిన విత్తనాలను చేతితో తలపైన ఎత్తుకొని, ఊరేగింపుగా డప్పుచప్పుళ్లతో నృత్యాలు చేస్తూ.. గ్రామ శివారులో ఉండే చెరువులో నిమజ్జనం చేస్తారు.

ఈ ఆధునిక కాలంలో కూడా వారి ఆచారాలను మరువకుండా పద్దతిగా పాటిస్తూ.. ఆదర్శంగా నిలుస్తున్నాయి నిజామాబాద్ లోని గిరిజన తండాలు. తరాలు మారుతున్నా వారి ఆచారాలను మాత్రం తూచా తప్పకుండా పాటిస్తున్నారు. తండాలలో ఉంటున్న కుటుంబాల పిల్లలు ఉద్యోగరీత్యా వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడినప్పటికీ… తీజ్‌ పండుగ వచ్చిందంటే మాత్రం వారివారి స్వస్థలాలకు చేరుకుని కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలు జరుపుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed