- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆర్టీఐ చట్టాన్ని నిర్లక్ష్యం చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి: జంగిటి శ్రీనివాస్
దిశ, నారాయణపేట ప్రతినిధి: సమాచార హక్కు చట్టాన్ని నిర్లక్ష్యం చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆర్టీఐ పరిరక్షణ కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్ అన్నారు. సోమవారం శీల గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో సమాచార హక్కు చట్టం -2005 అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టం సెక్షన్ 3 ప్రకారం దేశ పౌరులందరూ సమాచారం పొందే హక్కు ఉందని.. సెక్షన్ 6(1) ప్రకారం సమాచారం కొరకు దరఖాస్తు దారులు వివిధ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోగా, 30 రోజులు ఇవ్వవలసిన సమాచారాన్ని కొన్ని నెలలు గడిచిన ఎలాంటి సమాచారం ఇవ్వట్లేదనని స్టేట్ కమిషన్ ఆఫీస్‌లో కమిషనర్లు లేక వేల దరఖాస్తులు పరిష్కారం కావడం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే కమిషనర్లను నియమించాలని, సమాచార హక్కు చట్టాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎలిగేండ్ల వెంకటేష్, చిన్నయ్య, చంద్రశేఖర్, గణేష్, గోపాల్, మోహన్ గౌడ్, కృష్ణ, మురళి, రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.