ఉపాధ్యాయుల పదోన్నతుల పూర్తి…కామారెడ్డి జిల్లాలో 787 మందికి పదోన్నతులు

by Kalyani |
ఉపాధ్యాయుల పదోన్నతుల పూర్తి…కామారెడ్డి జిల్లాలో 787 మందికి పదోన్నతులు
X

దిశ, ప్రతినిధి, నిజామాబాద్ : విద్యాశాఖలో స్కూల్ అసిస్టెంట్ల పదోన్నతుల ప్రక్రియ బుధవారం ముగిసింది. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇతర సబ్జెక్టుల ఉపాధ్యాయులు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందారు. నిజామాబాద్ జిల్లాలో సుమారు 720 మంది ఉపాధ్యాయులకు గాను 302 మంది ఉపాధ్యాయులు పదోన్నతులు పొందారు. కామారెడ్డి జిల్లాలో 787 మందికి పదోన్నతులు కల్పించారు. ఎస్జీటీలు, పీఈటీలు, లాంగ్వేజ్ పండిత్-2లకు సంబంధించిన బదిలీల దరఖాస్తులను విద్యాశాఖ అధికారులు స్వీకరించనున్నారు. మిగిలిన పోస్టు లకు రెండు కానీ అంతకంటే ఎక్కువ పదోన్నతి వచ్చిన ఉపాధ్యాయులు ఒకేచోట చేరే అవకాశం ఉంది. దీంతో వారి స్థానాల్లో తిరిగి పదోన్నతులను 15 రోజుల్లో ఇవ్వనున్నారు.

ఎస్జీటీ, ఈక్వనాలెంట్ క్యాడర్ కు సంబంధించి ఈనెల 20లోగా ఉపాధ్యాయులు దరఖాస్తులు సమర్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్పీ దుర్గాప్రసాద్ తెలియజేశారు. జూన్ 1, 2024 వరకు 8 సంవత్సరాల సర్వీసు, ఇప్పుడు పనిచేస్తున్న పాఠశాలల్లో పూర్తయిన వారు, గతంలో దరఖాస్తు చేయనివారు తప్పనిసరిగా దరఖాస్తు చేయాలని ఆయన తెలిపారు. జూన్ 1, 2024 వరకు రెండు సంవత్సరాలు పూర్తయి గతంలో దరఖాస్తు చేయకపోతే ఆసక్తి ఉంటే బదిలీ కొరకు దరఖాస్తులు చేయాలని డీఈవో తెలిపారు. జూన్ 1, 2024 నుంచి మూడు సంవత్సరాలలోపు సర్వీసు ఉన్నవారు గతంలో బదిలీ దరఖాస్తు చేసి ఉంటే బదిలీ వి మినహాయింపు కొరకు దరఖాస్తు చేయాలని స్పెషల్ కేటగిరి కింద ఎవరైనా అర్హులు ఉంటే తగిన సర్టిఫికెట్లు సమర్పించి దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.

జిల్లాలో 787 మందికి ప్రమోషన్‌లు

కామారెడ్డి జిల్లాలో ఆయా కేటగిరిల్లో స్థానిక సంస్థలు, ప్రభుత్వ సాఠశాలల్లో మొత్తం 787 మంది ఉపాధ్యాయులు పదోన్నతులు పొందారు. పీఎస్‌ హెచ్‌ఎం 103, స్కూల్‌ అసిస్టెంట్‌లుగా ఇంగ్లీష్‌ –30, గణితం– 39, తెలుగు– 201, బయో సైన్స్‌– 36, హింది–178, ఫిజికల్‌ ఎడ్యూకేషన్‌ –75, ఫిజికల్‌ సైన్స్‌– 19, సోషల్‌ స్టడిస్‌– 99, స్పెషల్‌ ఎడ్యూకేషన్‌ –2, ఉర్ధూ–5 ఇలా మొత్తం 22 కేటగిరిల్లో ఉపాధ్యాయులు ప్రమోషన్‌లు పోందారు. వీరందరికి డీఈవో కార్యాలయంలో ఆర్డర్‌ కాపీలను తీసుకుని వారి స్థానంలో జాయిన్‌ అయ్యారు.

Next Story

Most Viewed