- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బెల్ట్ షాప్ పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి
దిశ, కామారెడ్డి : కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పాత రాజంపేట గ్రామంలో బెల్టు షాపు నిర్వహణపై గ్రామస్తులు మంగళవారం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు బెల్టు షాపుపై దాడులు చేయడానికి వచ్చేసరికి సదరు షాపు నిర్వాహకుడు తాళం వేసుకుని పరారయ్యాడు. బెల్టు షాపు నిర్వాహకునికి దాడులు చేయడానికి టాస్క్ ఫోర్స్ అధికారులు వస్తున్నారని ముందుగానే సమాచారం అందించడంతో..తాళం వేసి పారిపోయాడని ప్రచారం సాగుతోంది. బెల్టు షాపులో దాదాపు రోజు లక్ష వరకు విక్రయాలు జరుగుతాయని గ్రామస్తులు చెప్తున్నారు. వైన్స్ నుంచి కాటన్ల కొద్దీ మద్యం తీసుకువచ్చి విక్రయిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం తాళం వేసి ఉన్న షాపు వద్దే టాస్క్ ఫోర్స్ అధికారులు వేచి చూస్తున్నారు. కాగా షాప్ ఎప్పుడు ఓపెన్ చేస్తే అప్పుడు సీజ్ చేయడానికి అధికారులు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.