- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IDCMS : నిజామాబాద్ ఐడీసీఎంఎస్ చైర్మన్ గా తారాచంద్ నాయక్..
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ఐడీసీఎంఎస్ ఛైర్మన్ గా బి.తారాచంద్ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర సహకార సంఘాల ఎలక్షన్ అథారిటీ ఆదేశాల మేరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఐడీసీఎంఎస్ చైర్మన్ పదవి కోసం నిజామాబాద్ లోని ఐడీసీఎంఎస్ కార్యాలయంలో సోమవారం ఎన్నిక ప్రక్రియ జరిగింది.
సోమవారం జరిగిన ఎన్నికల్లో డిచ్పల్లి పీఏసీఎస్ చైర్మన్ బి.తారాచంద్ నాయక్, కామారెడ్డి జిల్లా గాంధారి పీఏసీఎస్ చైర్మన్ పి.సాయన్నలు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ విత్ డ్రా సమయంలో సాయన్న తన నామినేషన్ ను ఉపసంహరించుకోగా, చైర్మన్ బరిలో తారాచంద్ నాయక్ ఒక్కరే మిగిలారు. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఐడీసీఎంఎస్ చైర్మన్ గా బి.తారాచంద్ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి పి.రామ్మోహన్ అధికారికంగా ప్రకటించారు. ఈ ఎలక్షన్ కు కామారెడ్డి డిప్యూటీ రిజిస్ట్రార్ పి.రామ్మోహన్ ఎలక్షన్ ఆఫీసర్ గా వ్యవహరించగా, ఆడిటర్ సాయిలు, జూనియర్ అసిస్టెంట్ సృజన్, ఆఫీస్ సబార్డినేట్ సాజిద్ లు ఎన్నికల నిర్వహణలో పాలుపంచుకున్నారు. సహకార సంఘాల ఎలక్షన్ అథారిటీ హైదరాబాద్ వారి ఆదేశాల మేరకు షెడ్యూల్ ప్రకారం నిజామాబాద్ ఐడీసీఎంఎస్ చైర్మన్ పదవికి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించినట్లు ఎలక్షన్ ఆఫీసర్ రామ్మోహన్ 'దిశ' కు తెలిపారు.
సాయన్నకు వైస్ ప్రెసిడెంట్ హామీ..
ఐడీసీఎంఎస్ చైర్మన్ పదవికి నామినేషన్ వేసి చివరి క్షణంలో పోటీ నుంచి తప్పుకున్న గాంధారి సొసైటీ చైర్మన్ సాయన్నకు డీసీసీబీ వైస్ చైర్మన్ పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆయనకు వైస్ చైర్మన్ పదవి పై స్పష్టమైన హామీ దక్కడంతోనే ఐడీసీఎంఎస్ చైర్మన్ రేసు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.