- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మాల్యాద్రి రెడ్డి మాట వెనక్కి తీసుకోవాలని.. దళిత సంఘాల నిరసన
దిశ బాన్సువాడ: బాన్సువాడ ఏరియా అస్పత్రి సూపరెండెంట్ పెరిక శ్రీనివాస్ ప్రసాద్ పై బీజేపీ నాయకుడు మాల్యాద్రి రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని బీర్కూర్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు కోరిమె రఘు డిమాండ్ చేశారు. మాల్యాద్రి రెడ్డి సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, సూపరెండెంట్ శ్రీనివాస్ ప్రసాద్ లపై చేసిన విమర్శలపై బీర్కూర్ మండల కేంద్రంలోని కామప్ప చౌరస్తా, మండలంలోని సాంబాపూర్ లలో ధర్నా, రస్తారోకో కార్యక్రమాలను నిర్వహించి, మాల్యాద్రి దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈ సందర్బంగా కోరిమె రఘు మాట్లాడుతూ.. బాన్సువాడను అద్దంలా అభివృద్ధి చేస్తున్న స్పీకర్ పోచారం, అస్పత్రి లో అన్నివర్గాలకు సేవలందిస్తున్న డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ లపై అనవసరమైన వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. మాల్యాద్రి వెంటనే ఈ విషయం పై వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే ఆయన ను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. కార్యక్రమం లో దళిత నాయకులు పాల్గొన్నారు.