కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

by Sridhar Babu |
కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
X

దిశ, నిజామాబాద్ సిటీ : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ అరవింద్ అన్నారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ గుట్ట లో ఏర్పాటు చేసిన వికాస్​భారత్ సంకల్పయాత్ర సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మోడీకి గ్యారెంటీ పథకానికి రాష్ట్ర ఉద్యోగులు గ్రామాలకు వస్తారని, అర్హులైన వారందరూ కేంద్ర ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు. రేషన్ కార్డు లేని వారు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలని,

ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో అర్హులైన వారందరికీ ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దీని ద్వారా ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత ఆరోగ్య బీమా లభిస్తుందన్నారు. ఇది ప్రజలకు వరం లాంటిది అన్నారు. సిలిండర్ ను కూడా కేంద్ర ప్రభుత్వం అందజేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి ప్రజల చెంతకు చేర్చేందుకు చొరవ చూపాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి, ఎల్లమ్మ గుట్ట కార్పొరేటర్ న్యాలం రాజు, ఆకుల లతా హేమేందర్ లతోపాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story