సేవలతో దూసుకుపోతున్న సునీల్ కుమార్

by Sridhar Babu |   ( Updated:2023-11-19 16:19:06.0  )
సేవలతో దూసుకుపోతున్న సునీల్ కుమార్
X

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్ సేవా కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో బీఎస్పీ తరఫున బాల్కొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచి ఓటమిని చవి చూశారు. ఓటమితో నిరాశ, నిస్ప్రహకు గురికాకుండా ఎలాంటి పదవి లేకున్నా బాల్కొండ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలకు నేనున్నానంటూ సేవా కార్యక్రమాలు చేపడుతూ నగదు ఖర్చులకు సైతం వెనకాడ లేదు. ముత్యాల సునీల్ కుమార్ ఆరెంజ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ను నిర్వహిస్తూ తొలుత తెలంగాణ జాగృతి పక్షాన రాజకీయాల్లోకి ప్రవేశించారు.

బాల్కొండ నియోజకవర్గంలో ఎవరికి ఏ శుభకార్యం ఉన్నా తన ఆరెంజ్ ట్రావెల్స్ లోని బస్సులను ఉచితంగా ప్రజలకు అందించి ప్రజల అభిమానాన్ని చూరగొని వారి మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. దీంతో పాటు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నగదు ఆర్థిక సాయం అందిస్తూ ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు నేనున్నానంటూ ముత్యాల సునీల్ కుమార్ ధైర్యాన్ని ఇచ్చారు. ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల్లో బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ముత్యాల సునీల్ కుమార్ పోటీ చేస్తూ బాల్కొండ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. నియోజక వర్గంలో ఏ ఊరికి వెళ్లినా గత ఐదేళ్ల కాలంలో తాను అందించిన సేవా కార్యక్రమాలను ప్రజలు ఆయనకు గుర్తు చేస్తూ ఏ పదవి లేనప్పుడే మాకు సహాయ సహకారాలు అందించిన మిమ్మల్ని ఈ దఫా ఎన్నికల్లో తప్పకుండా గెలిపించు కుంటామని భరోసా ఇస్తూ ముత్యాల సునీల్ కుమార్ ను ముందుకు పంపుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed