Electric pole : ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా...!

by Sumithra |
Electric pole : ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా...!
X

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్ర పరిధిలోని కోటార్ మూర్ రెవెన్యూ ఏరియాలో ఎస్ఎస్ 35 ట్రాన్స్ ఫార్మర్ నుంచి రైతుల పంట పొలాల్లోకి వెళ్లే విద్యుత్ లైన్ ప్రమాదకరంగా తయారైంది. ఇప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందో తెలియని పరిస్థితి ఆ విద్యుత్తు లైన్ వెంట గల ఓ విద్యుత్ స్తంభం వద్ద కనిపిస్తుంది. ఓ రైతు పంట పొలంలో ఆ విద్యుత్ లైన్ వెంబడి ఓ విద్యుత్ స్తంభం క్రింది నుండి పైన గల విద్యుత్ గల వరకు పచ్చని ఆకుల తీగలు విద్యుత్ వైర్లను అల్లుకున్నాయి.

ముందే వర్షాకాలం యే సమయంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అలాంటిది వర్షాలు కురుస్తున్న సమయంలో ఆ విద్యుత్ స్తంభం పరిసరాల్లోకి వెళ్తే ఆ రైతులు షాక్ కు గురయ్యే ప్రమాదం పొంచి ఉంది. కానీ విద్యుత్ అధికారులు ప్రమాదం జరిగితేనే స్పందిస్తారేమోనని చర్చ కోటార్మూర్ ఏరియా రైతుల్లో జరుగుతుంది. కనీసం ఎస్ఎస్ 35 ట్రాన్స్ఫార్మర్ విద్యుత్ తీగల వెంబడి అల్లుకున్న విద్యుత్ స్తంభానికి తీగలను తొలగించాలన్న కనీస ఆలోచన విద్యుత్ అధికారులు చేయకపోవడం గమనార్హం. ఏది ఏమైనా ప్రమాదం జరిగితేనే విద్యుత్ అధికారులు స్పందిస్తారేమో చూడాలి మరి.

Advertisement

Next Story

Most Viewed