వీధి కుక్కల స్వైర విహారం

by Naresh |
వీధి కుక్కల స్వైర విహారం
X

దిశ, కామారెడ్డి: కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతూ ఎదురు వచ్చిన వారి వెంటపడుతూ కరుస్తున్నాయి. దీంతో ప్రజలు రోడ్లపై నడవాలంటే జంకుతున్నారు. చిన్నారులను బయటకు పంపించాలంటే తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. గత రెండు రోజులుగా పట్టణంలోని హౌసింగ్ బోర్డు, వికాస్ నగర్ కాలనీలో వీధి కుక్కల స్వైర విహారంతో పలువురు చిన్నారులకు గాయాలయ్యాయి. శుక్రవారం వికాస్ నగర్ లో వీధి కుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులు తీవ్ర గాయాల పాలయ్యారు. ఇంటి ముందు ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారుల పై వీధి కుక్కలు దాడి చేశాయి. దీంతో ఇద్దరు చిన్నారులకు తలకు, చేతులకు, కాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా హాస్పిటల్‌కు తరలించి చికిత్స చేయించారు. వీధి కుక్కలను తరిమికొట్టాలని కాలనీ వాసులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed