Sabarimala : శబరిమల అయ్యప్ప భక్తులకు BIG అలర్ట్

by Gantepaka Srikanth |   ( Updated:2024-10-13 04:13:16.0  )
Sabarimala : శబరిమల అయ్యప్ప భక్తులకు BIG అలర్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: అయ్యప్ప భక్తులకు శబరిమల(Sabarimala) ఆలయ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. అయ్యప్ప దర్శనం ఇక నుంచి 17 గంటల పాటు కల్పిస్తున్నట్లు తెలిపారు. మండలం మకరవిళక్కు సీజన్‌ను పురస్కరించుకొని ఉదయం 3 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంటల వరకు, మళ్లీ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు స్వామి దర్శనానికి భక్తులకు అనుమతి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. దర్శనానికి వచ్చే భక్తులంతా స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. కాగా, ఈ ఏడాది శబరిమలలో అయ్యప్ప స్వామి మండల పూజా మహోత్సవాలు నవంబరు 15వ తేదీ నుంచి డిసెంబరు 26వ తేదీ వరకు కొనసాగనున్నాయి. వచ్చే సంవత్సరం జనవరి 15వ తేదీన మకర సంక్రాంతి వేళ శబరిమలలో మకర జ్యోతి (మకర విలక్కు) దర్శనమిస్తుంది. ప్రతి రోజూ గరిష్టంగా దాదాపు 80 వేల మంది భక్తులను అయ్యప్ప స్వామి దర్శనానికి అనుమతించాలని ట్రావన్‌ కోర్ దేవస్థానం బోర్డు నిర్ణయించింది.

Advertisement

Next Story