- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Devara: 'దేవర' కలెక్షన్స్ పై నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
దిశ, వెబ్ డెస్క్ : కొరటాల శివ డైరెక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన 'దేవర' సినిమా. ఇటీవలే ఆడియెన్స్ కు ముందుకొచ్చి పెద్ద హిట్ కొట్టింది. సెప్టెంబర్ 27 న విడుదలైన ఈ మూవీ పది రోజుల్లోనే రూ.460 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. కలెక్షన్స్ ను బట్టి చూస్తే ఈ సినిమా ఎన్టీఆర్ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
ఈ సక్సెస్ ను ఎన్టీఆర్ అభిమానులు ఒక రేంజ్ లో సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. దసరా సెలవులు కూడా రావడంతో సినిమాకు బాగా ప్లస్ అయింది. ఇదిలా ఉండగా 'దేవర' కలెక్షన్స్ పై 'సితార ఎంటర్టైన్మెంట్స్' నిర్మాత నాగ వంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు.
" 'దేవర'కు తెలుగు రాష్ట్రాల నుంచి కలెక్షన్స్ భారీగా వచ్చాయి. మేం అయితే ఎంత వచ్చాయో అంతే నెంబర్ పెట్టాము. ఫ్యాన్స్ కోసమే సినిమా కలెక్షన్స్ పోస్టర్లు వేసేది. ఎందుకంటే వాళ్లు సంతోషంగా ఉంటేనే మేము కూడా హ్యాపీగా ఉంటాం. ఇది ఎప్పటినుంచో ఉంది. ఈ మూవీ సెలబ్రేషన్స్‌ని విదేశాల్లో ప్లాన్ చేశామంటూ ఎన్నో వార్తలు వస్తున్నాయి. వాటిలో ఎలాంటి నిజం లేదంటూ.." చెప్పుకొచ్చారు. దీంతో నాగ వంశీ చేసి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.