- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి : జిల్లా కలెక్టర్
దిశ, కామారెడ్డి రూరల్ : జిల్లాలో నీటి ఎద్దడి ఏర్పడకుండా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో మంగళవారం నీటి ఎద్దడి నివారణ పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ మున్సిపాలిటీల పరిధిలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా అధికారులు ముందు జాగ్రత్తగా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో పట్టణాల్లో, గ్రామాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేసే విధంగా అధికారులు చూడాలని చెప్పారు. వడదెబ్బ తగలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై ఉపాధి హామీ కూలీలకు, స్వయం సహాయక సంఘాల మహిళలకు వైద్య సిబ్బంది అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టిని పెట్టాలని సూచించారు. మురుగు కాలువల్లో పూడిక తీయించి, ఆయిల్ బాల్స్ వేయాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని నర్సరీలో మొక్కలు పెరిగే విధంగా సంరక్షణ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వాతావరణ మార్పు, ఆరోగ్య ప్రభావాలు అనే గోడప్రతులను జిల్లా అధికారులు ఆవిష్కరించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, డిఆర్డిఓ సాయన్న, డిపిఓ శ్రీనివాసరావు, జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్, మున్సిపల్, మిషన్ భగీరథ, ఆర్డ్ బ్ల్యూఎస్, విద్యుత్తు అధికారులు పాల్గొన్నారు.