- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రులను ఢిల్లీకి పంపడం కాదు.. పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో పంపాలి..
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కోటగిరి మండలం సుంకిని శివారులో ఇటీవల అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పరిశీలించారు. బాన్సువాడ నియోజకవర్గంలో హాథ్ సే హాథ్ జోడో పాదయాత్రలో భాగంగా ఆయన ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాలచే పంటనష్టాన్ని అంచనా వేయించాలని డిమాండ్ చేశారు. పంటల బీమా లేకపోవడంవల్ల తెలంగాణ రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. రైతులు పండించే పంటలకు ఇన్సూరెన్స్ కల్పించాలని, ఎకరానికి 15వేల నష్ట పరిహారం అందించాలని కోరారు. పంట నష్టం పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
పంట నష్టంపై పార్లమెంట్ లో ప్రస్తావిస్తాం అని రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసారి పంటనష్టం అంచనాలు వేస్తున్న నష్టపోయిన రైతులకు మాత్రం ఒక్క రూపాయి అందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి కానీ ప్రభుత్వం ఇప్పటివరకు ప్రకటన చేయకపోవడం దారుణం అన్నారు. మంత్రులందరిని ఢిల్లీకి పంపడం కాదు పంట పొలాల్లోకి పంపించండి అని సీఎం కేసీఆర్ కు హితువు పలికారు. కేసీఆర్ తో జత కట్టాక స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అవినీతిపరుడయ్యాడని పోచారం శ్రీనివాస్ కాస్తా పైసల శ్రీనివాస్ గా మారారు అన్నారు. బాన్సువాడలో తండ్రి కొడుకుల దోపిడీ ఎక్కువైందని ఆరోపించారు.