ఘనంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు..

by Sumithra |
ఘనంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు..
X

దిశ, బీర్కూర్ : బీర్కూర్ మండలంలోని తిమ్మాపూర్ శివారు ప్రాంతంలోని తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారి ఊరేగింపు పెద్ద శేష వాహనం పై జరిగింది. స్వయంగా శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పెద్దశేషవాహనం ట్రాక్టర్ ను నడిపారు. స్వామివారు రెండవ రోజు మాడవీధులలో ఊరేగించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులు, శంభురెడ్డి దంపతులు పూజలు నిర్వహించారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజలు నిర్వహించారు. మార్చి 1న ముఖ్యమంత్రి వస్తున్న సందర్భంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అధికారులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. జిల్లా యంత్రాంగం మొత్తం ఇక్కడనే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సీఎం రాక వలన పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం పర్యటన సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Advertisement

Next Story