సమ్మక్క సారక్క జాతరకు కామారెడ్డి నుంచి ప్రత్యేక బస్సులు

by Sridhar Babu |
సమ్మక్క సారక్క జాతరకు కామారెడ్డి నుంచి ప్రత్యేక బస్సులు
X

దిశ, కామారెడ్డి : ప్రభుత్వం ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కామారెడ్డి డిపో నుండి ఈనెల 19 నుంచి 24 వరకు సమ్మక్క సార లమ్మ మేడారం జాతరకు 58 బస్సులు ప్రత్యేకంగా నడిపిస్తున్నట్లు కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ ఇందిర తెలిపారు. ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే డిపో పరిధిలోని అన్ని గ్రామాలకు బస్సులు తక్కువగా నడపడం జరుగుతుందన్నారు. ప్రజలందరూ తమకు సహకరించాలని కోరారు. ఎక్కువగా బస్సులు తిరగనందున వారి ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరారు. ముఖ్యంగా స్కూల్, కాలేజీ విద్యార్ధులు, ఉద్యోగస్తులందరూ సహకరించాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed