- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Akhilesh: కాంగ్రెస్‌తో పొత్తు కొనసాగుతుంది.. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్
దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీతో తమ పొత్తు కొనసాగుతుందని సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ వర్ధంతి సందర్భంగా ఇటావాలో ఆయనకు నివాళులు అర్పించిన అనంతరం అఖిలేష్ మీడియాతో మాట్లాడారు. ఎస్పీ, కాంగ్రెస్ కూటమి చెక్కు చెదరకుండా ఉంటుందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ కలిసి పోటీ చేస్తామని చెప్పారు. మిగతా అంశాలను త్వరలోనే చర్చిస్తామని వెల్లడించారు. కాగా, హర్యానా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సరైన ప్రదర్శన చూపలేదు. ఈ క్రమంలోనే ఎస్పీ ఆరు అసెంబ్లీ స్థానాలకు బుధవారం అభ్యర్థులను ప్రకటించింది. అయితే తమను విశ్వాసంలోకి తీసుకోకుండానే ఉప ఎన్నికల అభ్యర్థులను ఎస్పీ ప్రకటించిందని కాంగ్రెస్ నేత అవినాష్ పాండే ఫైర్ అయ్యారు. దీంతో కాంగ్రెస్, ఎస్పీల మధ్య పొత్తు విచ్చిన్నమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే అఖిలేష్ క్లారిటీ ఇచ్చారు.
- Tags
- akhilesh yadav