- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్యాంక్‌బండ్‌పై అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ.. హాజరుకానున్న సీఎం
by karthikeya |
X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా 9 రోజులుగా ఘనంగా సాగుతున్న బతుకమ్మ సంబురాలు నేటితో ముగియనున్నాయి. ఈ రోజు (గురువారం) రాష్ట్ర వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే సాయంత్రం హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద ప్రభుత్వం ఆధ్వర్యంలో అంబరాన్నంటేలా బతుకమ్మ సంబరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సంబురాల్లో ఏకంగా 10 వేల మంది మహిళలు పాల్గొనబోతునట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, అధికారులు పాల్లగొననున్నారు. కాగా.. సాయంత్రం 4 గంటలకు అమరవీరుల స్మారక చిహ్నం నుంచి ట్యాంక్‌బండ్ వరకు బతుకమ్మలతో మహిళల ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రాత్రి 11 గంటల వరకు ట్యాంక్‌బండ్ సమీపంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Advertisement
Next Story