రాజేంద్రప్రసాద్ ను పరామర్శించిన నటుడు నాగార్జున

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-10-10 08:32:10.0  )
రాజేంద్రప్రసాద్ ను పరామర్శించిన నటుడు నాగార్జున
X

దిశ, వెబ్ డెస్క్ : సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ను హీరో నాగార్జున పరామర్శించారు. రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి ఇటీవల గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. కూకట్ పల్లిలోని ఇందు విల్లాస్ లోని రాజేంద్రప్రసాద్ ఇంటికి వెళ్లిన నాగార్జున గాయత్రి చిత్రపటం వద్ద పూలు చల్లి నివాళులు అర్పించారు. అనంతరం కూతురు మృతితో తీవ్ర దుఃఖంలో మునిగిపోయిన రాజేంద్రప్రసాద్ ను.. ఆయన కుటుంబసభ్యులను నాగార్జున పరామర్శించి ఓదార్చారు. నాగార్జున వెంట ఉన్న మాజీ క్రికెటర్ వంకిన చాముండేశ్వరనాథ్ కూడా రాజేంద్రప్రసాద్ ను పరామర్శించారు. అనంతరం హీరో శ్రీ విష్ణు కూడా రాజేంద్రప్రసాద్ ను పరామర్శించారు.

కూతురు గాయత్రి మరణంతో విషాదంలో మునిగిన రాజేంద్రప్రసాద్ ను ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవితో పాటు, పాన్ ఇండియా రెబ‌ల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు త్రివిక్రమ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, వెంక‌టేశ్, సీనియర్ నటుడు మోహన్ బాబు, నటుడు అజయ్‌, శివాజీ రాజా, సాయికుమార్, నాగ్‌అశ్విన్, పీఏసీ ఛైర్మన్‌ అరెకపూడి గాంధీ, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ప‌రామ‌ర్శించి ధైర్యం చెప్పారు.

Advertisement

Next Story