'నువ్వు కాపాడిన 3772వ ప్రాణం సామీ'.. మరో చిన్నారికి ప్రాణం పోసిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. (ఫ్లెక్సీ)

by Kavitha |   ( Updated:2024-10-10 08:24:42.0  )
నువ్వు కాపాడిన 3772వ ప్రాణం సామీ.. మరో చిన్నారికి ప్రాణం పోసిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. (ఫ్లెక్సీ)
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియాలో ది మోస్ట్ హ్యాండ్సమ్ హీరోల్లో ఒకరైన ఆయనకు ఓ రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అయితే మహేష్ పై ఇంతటి ప్రేమాభిమానాలు చూపడానికి కారణం సినిమాలే కాదు.. ఆయన చేస్తోన్న సామాజిక సేవా కార్యక్రమాలు కూడా. మహేష్ బాబు ఫౌండేషన్ పేరుతో పలు మంచి పనులు చేపడుతున్న విషయం తెలిసిందే. అందులో మెయిన్‌గా చెప్పుకోవాల్సింది చిన్న పిల్లల గుండె ఆపరేషన్ల గురించి. తన కుమారుడు గౌతమ్ పుట్టినప్పుడు కొన్ని ఆరోగ్య పరిస్థితుల కారణంగా గుండె జబ్బులు ఉన్న చిన్నారులకు ఉచితంగా వైద్యం చేయించాలని మహేష్ బాబు నిర్ణయం తీసుకున్నాడు. ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు వేల మంది చిన్నారులకు ఉచితంగా హార్ట్ సర్జరీలు చేయించాడు. తద్వారా వారి తల్లిదండ్రుల కళ్లలో వెలుగులు నింపాడు.

ఈ నేపథ్యంలో తాజాగా మహేష్ బాబు మరో చిన్నారికి ప్రాణం పోశాడు. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా కత్తుల వారి పేటకు చెందిన రెండేళ్ల రిత్వికకు ఉచితంగా గుండె సర్జరీ చేయించాడు. ఈ క్రమంలో కత్తుల వారి పేటలో మహేష్ ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 'నువ్వు కాపాడిన 3772 వ ప్రాణం సామీ.. నువ్వే మా దేవుడని నువ్వు నమ్మే పని లేదు. మాకు నమ్మించే అక్కర లేదు. ఇది నీ దర్శనం.. ఇది నిదర్శనం' అంటూ ఖలేజా మూవీలోని డైలాగ్‌తో వినూత్నంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు మహేష్ ఫ్యాన్స్. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు మహేష్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

(video link credits to ursrishi7 X account)

Advertisement

Next Story