- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Shraddha Kapoor: ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్ బస్టర్ హిట్ ‘స్త్రీ-2’.. ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్దా కపూర్(Shraddha Kapoor), రాజ్ కుమార్ రావు జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘స్త్రీ-2’(Stree-2). హారర్ కామెడీ జోనర్ తెరకెక్కిన ఈ సినిమాకు అమర్ కౌశిక్ (Amar Kaushik) దర్శకత్వం వహించారు. అయితే ఇది ‘స్త్రీ’ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన ‘స్త్రీ-2’ ఆగస్టు 15న(August 15) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై ఫస్ట్ షో నుంచే హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా ప్రేక్షకులను మెప్పించడంతో పాటుగా కలెక్షన్లు కూడా భారీగానే రాబట్టింది.
బాక్సాఫీసు వద్ద రూ. 600 కోట్లకు పైగా రాబట్టి పలు రికార్డులు సొంతం చేసుకుంది. అయితే ఇటీవల స్త్రీ-2 మూవీ రెంటల్ ఫీ విధానంలో రూ. 349 చెల్లించి వీక్షించే అవకాశం ఉండేది. తాజాగా, స్త్రీ-2 (Stree-2)చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో వినియోగదారులు ఉచితంగా చూడవచ్చు. అయితే అది కూడా హిందీ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉన్నట్లు సమాచారం. తొందరలోనే తెలుగు, ఇతర భాషల్లో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియులు ఆనందపడుతున్నారు.
#Stree2 (Hindi) Now Streaming on @PrimeVideoIN - Available for all prime members.#OTT_Trackers pic.twitter.com/3LrPqP8oat
— OTT Trackers (@OTT_Trackers) October 10, 2024