మా భూమిని మాకు ఇప్పించండి.. జిల్లా అధికారులకు వినతి..

by Sumithra |
మా భూమిని మాకు ఇప్పించండి.. జిల్లా అధికారులకు వినతి..
X

దిశ, నిజామాబాద్ సిటీ : తమ భూమిని అక్రమించాలని చూసే కొంతమంది కబ్జాదారులతో చేయికలిపిన ఎస్సై తమను బెదిరిస్తున్నారని బాధితుడు అజ్మరా రవి మీడియాతో తెలిపారు. కొంత మంది కబ్జాదారులు వారిని వారి భూమిని ఆక్రమిస్తున్నారంటూ ఫిర్యాదు చేశామని తెలిపారు. ఆ కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందని తెలిపారు. అయినా ఎస్సై గణేష్ పట్టించుకోవడం లేదని, ముందుగా తమకు అండగా ఉంటామని చెప్పిన ఎస్సై ఇప్పుడు వారిని బెదిరిస్తున్నాడని బాధితుడు అజ్మరా రవి వాపోయాడు. రాత్రికి రాత్రి ఎస్సై మారి పోయాడని ఆవేదన వ్యక్తం చేశాడు. మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ డిచ్ పల్లి మండలం సుద్ధపల్లి గ్రామానికి చెందిన నాకు 50 సంవత్సరాల నుంచి సుద్దపల్లి శివారులో సర్వే నంబర్ 55/21 లో 20 గుంటల భూమి ఉండగా పట్టా పాస్ బుక్ కూడా ఉన్నదని రైతు బంధు వస్తుండగా, సంవత్సరం నుంచి వారికి చెందిన 9 మంది అజ్మరా రవి, బాబు, అరవింద్, వెంకటేష్, గణేష్, లక్ష్మి, గంగు, అరుణ్, నరేష్, ఇబ్బందులకు గురి చేస్తున్నారని చంపుతా నని బెదిరిస్తున్నారని, ఎస్సైకి ఫిర్యాదు చేయగా కోర్ట్ నుంచి ఆర్డర్ తీసుకోమని చెప్పి, కోర్ట్ నుంచి ఆర్డర్ తీసుకున్నాక రాత్రికి రాత్రికే డబ్బులకు అమ్ముడు పోయాడని తెలిపారు.

తరువాత వాళ్లను సపోర్ట్ చేస్తూ తనను బెదిరిస్తున్నాడని అన్నారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు విన్నవించగా ఎంఆర్ఓ ఫోన్ చేసి చెప్పాడని, ఎంఆర్ఓ మా భూమి వద్దకు వచ్చి ఈ భూమి మాకు చెందినదని దృవికరించగా ఆ రోజు ఒప్పుకొని, తరువాత రోజు నుంచి మా భూమిలో పందిరి వేసి పశువులను కట్టేస్తున్నారని, హద్దులు అన్ని తీసేసి అక్కడకు వెళితే చంపుతామని బెదిరిస్తూ, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ బెదిరిస్తున్నారని అన్నారు. జిల్లా అధికారులు వారి నుంచి తనను. తన కుటుంబాన్ని రక్షించాలని కోరారు. ప్రెస్ మీట్ లో బాధితుడి తండ్రి శంకర్, గుజ్జి పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed