గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయుడి అసభ్యకర ప్రవర్తన

by Sridhar Babu |
గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయుడి అసభ్యకర ప్రవర్తన
X

దిశ,నిజాంసాగర్ : కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో పార్ట్ టైం ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న రాజు విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 524 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ గురుకుల పాఠశాలలో పార్ట్ టైం ఇంగ్లీష్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న రాజు రాత్రి వేళలో మద్యం సేవిస్తూ పాఠశాలకు వచ్చి విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా ఈనెల 13 వ తేదీన రాత్రి వేళ మద్యం సేవించిన రాజు పాఠశాలకు వచ్చాడు. ఏడవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థితో సదరు ఉపాధ్యాయుడు కాళ్లు ఒత్తిపించుకొని మసాజ్ చేయించుకున్నాడు. అంతటితో ఆగకుండా ఉపాధ్యాయుడు బాత్రూంకు వెళుతూ, సదరు విద్యార్థి ని బాత్ రూం కు వెంట తీసుకొని వెళ్లి బాత్రూంలో విద్యార్థితో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ పరుష పదజాలంతో దూషించాడు. ఈ విషయాన్ని సదరు విద్యార్థి తనకు ఎదురైన సంఘటన గురించి, ఉపాధ్యాయుడి ప్రవర్తన గురించి మరసటి రోజు

గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఎండ్రీ, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ దృష్టికి తీసుకు వెళ్లాడు. దీంతో విద్యార్థి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన పార్ట్ టైం ఉపాధ్యాయుడు రాజును పాఠశాల ప్రిన్సిపాల్ తాత్కాలికంగా విధుల నుంచి తొలగించినట్టు తెలిసింది. గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించకుండా, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed