Purushottam Express: రైలులో ఉగ్రవాది.. 3 గంటలు తనిఖీ చేశాక..

by Rani Yarlagadda |
Purushottam Express: రైలులో ఉగ్రవాది.. 3 గంటలు తనిఖీ చేశాక..
X

దిశ, వెబ్ డెస్క్: ఈ మధ్యకాలంలో రైళ్ల పై ఆకతాయిల అకృత్యాలు పెరిగిపోతున్నాయి. ట్రాక్ లకు అడ్డంగా ఏదొక వస్తువుని అడ్డంగా పెట్టడం వంటివి పనులు చేసి ప్రమాదాలు సృష్టించేందుకు ప్రయత్నించారు. లోకో పైలట్స్, రైల్వే అధికారులు వాటిని ముందే గుర్తించి తొలగించడంతో.. చాలా రైలు ప్రమాదాలు తప్పాయనే చెప్పాలి. తాజాగా ఒక ఎక్స్ యూజర్.. ఒక రైలులో ఉగ్రవాది పేలుడు పదార్థాలతో ఉన్నాడని ఫేక్ పోస్ట్ చేశాడు. పూరీ - ఢిల్లీ మధ్య ప్రయాణించే పురుషోత్తం ఎక్స్ ప్రెస్ లో ఉగ్రవాది ఉన్నాడని చెప్పడంతో.. పోలీసులు జాగిలాలతో రైలు వద్దకు చేరుకున్నారు.

గురువారం తెల్లవారుజామున 2.30 గంటల నుంచి 6 గంటల వరకూ ఉత్తర ప్రదేశ్ లోని తుండ్ల రైల్వే స్టేషన్ లో రైలును నిలిపివేసి.. క్షుణ్ణంగా తనిఖీ చేశారు. డాగ్ స్క్వాడ్ తో రైలులో ప్రతి అంగుళాన్ని తనిఖీ చేయగా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులు లభించలేదని ప్రయాగ్ రాజ్ రైల్వే డివిజన్ అధికారి వెల్లడించారు. రైలులో ఉగ్రవాదం, పేలుడు పదార్థాలు లేవని నిర్థారించుకున్నాక.. రైలు ప్రయాణం మొదలైంది. కాగా.. రైలులో తనిఖీలు చేస్తున్నంతసేపు ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఆ ఉగ్రవాది ఎక్కడన్నాడో, ఏ క్షణాన ఎక్కడ ఏం పేలుతుందోనని భయాందోళన చెందారు.

Advertisement

Next Story