నేడు నాగార్జున పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో విచారణ

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-10-10 06:00:35.0  )
నేడు నాగార్జున పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో విచారణ
X

దిశ, వెబ్ డెస్క్ : మంత్రి కొండా సురేఖపై నాగార్జున వేసిన వంద కోట్ల పరువు నష్టం పిటిషన్‌పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ కొనసాగనుంది. ఇప్పటికే నాగార్జునతో పాటు మొదటి సాక్షి సుప్రియ స్టేట్‌మెంట్‌ రికార్డు చేసిన కోర్టు.. ఈ రోజు రెండో సాక్షి వెంకటేశ్వర్లు స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేయనుంది. మంగళవారం విచారణ సందర్భంగా దేనికోసం పిటిషన్ ఫైల్ చేశారని నాగార్జునను కోర్టు ప్రశ్నించింది. మంత్రి కొండా సురేఖ తన కుటుంబంపై అమర్యాదపూర్వక వాఖ్యలు చేశారని నాగార్జున తెలిపారు. దీని వలన తమ కుటుంబ పరువు మర్యాదలకు భంగం వాటిల్లిందని కోర్టుకు నాగార్జున స్టేట్‌మెంట్ ఇచ్చారు. సినిమా రంగం ద్వారా తమ కుటుంబానికి మంచి పేరు, ప్రతిష్ఠలు ఉన్నాయని నాగార్జున తెలిపారు.

దేశవ్యాప్తంగా తమ కుటుంబం పట్ల ప్రజల ఆధారాభిమానాలు ఉన్నాయని అన్నారు. జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వచ్చాయని, సినిమా రంగంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు సైతం చేస్తున్నామని తెలిపారు. తమ కొడుకు విడాకులకు మాజీ మంత్రి కేటీఆర్ కారణమంటూ మంత్రి అసభ్యంగా మాట్లాడారని చెప్పారు. అలా మాట్లాడం వలన తమ పరువు, ప్రతిష్ఠలకు భంగం వాటిల్లిందని అన్నారు. మంత్రి కొండా సురేఖఫై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

Next Story