Eye health : వీటిని రెగ్యులర్‌గా తీసుకుంటే చాలు.. కళ్లజోడు అవసరం ఉండదిక!

by Javid Pasha |   ( Updated:2024-10-11 14:55:56.0  )
Eye health : వీటిని రెగ్యులర్‌గా తీసుకుంటే చాలు.. కళ్లజోడు అవసరం ఉండదిక!
X

దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు ఏజ్‌బార్ అయిన వ్యక్తులు కూడా ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. 60 ఏండ్లు దాటినా కంటి చూపు మందగించేది కాదని పెద్దలు చెప్తుంటారు. ఎక్కువ భాగం శారీరక శ్రమతో కూడిన జీవనశైలి, సహజ సిద్ధమైన ఆహారాలు తీసుకోవడమే అందుకు కారణంగా పేర్కొంటారు. దీంతో వృద్ధాప్యం వచ్చినా కళ్లు బాగానే కనబడేవి కనుక కళ్ల జోడు అవసరం అంతగా ఉండకపోయేది. ఈ రోజుల్లో అయితే పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటోంది. వయస్సుతో సంబంధం లేకుండా చిన్న పిల్లలు మొదలుకొని పెద్దల వరకు కళ్లజోడు, కాంటాక్ట్ లెన్స్ వాడుతున్న వారి సంఖ్యపెరుగుతోందని నిపుణులు చెప్తున్నారు. అయితే కంటి ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు లభించే ఆహారాలు తీసుకోవడంవల్ల ఎక్కువ కాలంపాటు కళ్లజోడు అవసరం లేకుండా జీవించే అవకాశం ఉంటుందని కంటి వైద్య నిపుణులు చెప్తున్నారు. అలాంటి ఆహారాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

* వారంలో రెండు సార్లు చేపలు : వయస్సు మీదపడినా కంటిచూపు మెరుగ్గా ఉండాలంటే వారంలో రెండుసార్లు చేపలు లేదా ఏదైనా సముద్రపు ఆహారం తినడం మంచిదని నిపుణులు చెప్తున్నారు. వీటిలో ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి కంటి చూపును మెరుగ్గా ఉంచడంవల్ల కళ్లజోడు అవసరాన్ని నివారిస్తాయి.

* వాల్ నట్స్ : అలాగే బాదం, జీడిపప్పు, పిస్తా వంటి నట్స్ రోజూ రాత్రిళ్లు నీటిలో నానబెట్టి ఉదయం తినడంవల్ల కూడా కంటి చూపు మెరుగు పడుతుంది. వీటిలో విటమిన్ ఇ, ఒమెగా - 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండటంవల్ల కంటి నరాలు, కణాలకు రక్షణ కల్పించడం ద్వారా చూపును కోల్పోకుండా కాపాడుతాయి.

* పలు రకాల గింజలు : కళ్ల ఆరోగ్యానికి మేలు చేసే ముఖ్యమైన మరికొన్ని ఆహారాల్లో చియాసీడ్స్, పొద్దు తిరుగుడు గింజలు, అవిసె గింజలు, గుమ్మడి కాయ విత్తనాలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. వీటిలో విటమిన్ ఇ, ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం మూలంగా కంటి చూపును మెరుగు పరుస్తాయి. అలాగే విటమిన్ ఎ, సి అధికంగా ఉండే క్యారెట్, టమాటా, యాపిల్, పైనాపిల్ ద్రాక్ష, నిమ్మ, కివీ, బొప్పాయి వంటివి కంటి ఆరోగ్యానికి మంచిది.

*ఆకు కూరలు : దాదాపు అన్ని రకాల ఆకు కూరలు కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. ముఖ్యంగా పాలకూర, పాయిల్ కూర, పుంటికూర, బచ్చలి కూర, తోట కూర, చుక్క కూరలను ఆహారంలో భాగంగా రెగ్యులర్‌గా తీసుకుంటూ ఉండాలి. వీటిలో విటమిన్ ఎ, ఇ, ఐరన్ అధికంగా ఉంటుంది. అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ఐరన్ ఉంటాయి. ఇవన్నీ ఫిజికల్ హెల్త్‌తో పాటు కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయని, తద్వారా చిన్న వయస్సులో చూపు మందగించడం, కళ్లజోడు వాడాల్సి రావడం వంటి పరిస్థితులను నివారించవచ్చునని కంటివైద్య నిపుణులు చెప్తున్నారు.

*నోట్: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించడం లేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed