అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు..

by Mahesh |
అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు..
X

దిశ, గాంధారి: ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు ఓడిగిపోయిన ఘటన గాంధారి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడిమెట్ శివారులో గల బాన్సువాడ కామారెడ్డి రహదారిపై వెళ్తున్న బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు వంగిపోయింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గుర్యయ్యారు. సరైన సమయంలో బస్సు ఆగిపోవడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకోలేదని అధికారులు తెలిపారు. స్వల్ప గాయాలతో బయటపడ్డారని తెలిపారు. కాగా డ్రైవర్ నిర్లక్ష్యం తోటి ఈ ఘటన జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికి పెను ప్రమాదం నుంచి తప్పించుకున్న ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed