విజయదశమి అందరికి విజయాలు చేకూర్చాలి : సీపీ రామగుండం

by Sumithra |   ( Updated:2024-10-12 09:47:15.0  )
విజయదశమి అందరికి విజయాలు చేకూర్చాలి : సీపీ రామగుండం
X

దిశ, గోదావరిఖని : విజయదశమి పండుగ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి మంచిర్యాల్ జోన్ ల ప్రజలకు, అధికారులకు, సిబ్బందికి అన్ని రంగాలలో విజయం చేకూర్చాలని, రామగుండం పోలీస్ కమిషనరేట్ అన్ని రంగాలలో అగ్రభాగంలో ఉండాలని కోరుతూ రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపీఎస్., (ఐజి) ఆకాంక్షించారు.

రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ కమీషనర్ ఆయుధ పూజ, వాహన పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గా దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శక్తికి ప్రతీకగా నిలిచే దుర్గామాత సమక్షంలో ప్రతి ఆయుధానికి ఎంతో శక్తి కలిగి ఉంటుందని అలాంటి విజయాలను చేకూర్చే విజయదశమి పర్వదినోత్సవం అందరికి సుఖ సంతోషాలు కలిగించాలని ఆకాంక్షించారు. పోలీస్ శాఖలో ప్రతి స్థాయిలోని అధికారి ప్రజా రక్షణలో ముందుంటూ మన్ననలు అందుకుంటూ పోలీస్ శాఖ గౌరవం మరింత పెరిగేలా పని చేయాలన్నారు. చెడు పై మంచి సాధించిన విజ‌యానికి గుర్తుగా విజ‌య‌ద‌శ‌మి పండుగ‌ను జ‌రుపుకుంటార‌ని అన్నారు. స‌మాజంలో చెడును పార‌ద్రోలేందుకు పోలీసు విభాగం కృషి చేస్తుంద‌ని తెలిపారు. అనంతరం వాహనాల పూజ నిర్వహించి అందరికి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ పూజా కార్యక్రమాలలో మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్ ఐపిఎస్., అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి.రాజు, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, టాస్క్ ఫోర్స్ ఏసీపీ మల్లారెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ నర్సింహులు, ఏ ఆర్ ఏసీపీ ప్రతాప్, సుందర్ రావు, ఆర్ఐ లు దామోదర్, మల్లేశం, వామన మూర్తి, సంపత్, శ్రీనివాస్, రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ సంఘం అధ్యక్షులు బోర్లకుంట పోచలింగం, ఎస్ఐ, ఆర్ఎస్ఐ లు, డ్రైవర్లు, స్పెషల్ పార్టీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story