- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జామ్‌నగర్ రాజకుటుంబ వారసుడిగా అజయ్ జడేజా
దిశ, డైనమిక్ బ్యూరో: భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజాను గుజరాత్‌లోని జామ్‌నగర్ రాజ కుటుంబానికి వారసుడిగా ప్రకటించారు. ఈ మేరకు నవనగర్ ప్రస్తుత మహారాజా జామ్ సాహెబ్ తాజాగా ఒక ప్రకటనలో ధృవీకరించారు. అజయ్ జడేజా తమ రాజ కుటుంబ వారసత్వ సింహాసనాన్ని అధిష్టిస్తారని వెల్లడించారు.
‘దసరా పండుగ పాండవులు అజ్ఞాతవాసం నుంచి బయటపడిన రోజును సూచిస్తుందని నమ్ముతారు. ఈరోజు దసరా కాబట్టి అజయ్ జడేజాను రాజ కుటుంబానికి వారసుడిగా, నవనగర్ తదుపరి జామ్ సాహెబ్‌గా ప్రకటిస్తున్నాను. జామ్‌నగర్ ప్రజలకు సేవ చేసే బాధ్యతను అజయ్ జడేజా తీసుకోవడం నిజంగా ఇక్కడి ప్రజలకు ఒక వరం. ఆయనకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అని మహారాజా శత్రుసల్యసింహ ప్రకటనలో తెలిపారు. కాగా, దేశంలో దాదాపు రాచరిక వ్యవస్థ లేనప్పటికీ గుజరాత్‌లోని నవనగర్ ప్రస్తుత జామ్‌నగర్ ప్రాంతంలో రాజకుటుంబ పాలన ఇంకా కొనసాగుతున్నది. అజయ్‌జడేజా నవనగర్ రాజకుటుంబంలో విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనను తదుపరి వారసుడిగా ప్రకటించారు.