సాలూరులో రెచ్చిపోయిన యువకులు... ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడి

by srinivas |   ( Updated:2024-10-12 10:06:25.0  )
సాలూరులో రెచ్చిపోయిన యువకులు... ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడి
X

దిశ, వెబ్ డెస్క్: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు(Parvathipuram Manyam District Salur)లో దారుణం జరిగింది. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌(RTC Bus Driver)పై యువకులు దాడి చేశారు. సాలూరులో కొందరు యువకులు రోడ్డుకు అడ్డంగా బైక్ పార్క్ చేశారు. విజయనగరానికి(Vijayanagaram) వెళ్తున్న బస్సు ఆ సమయంలో అటుగా వచ్చింది. అయితే బైక్ పక్కకు తీయాలని యువకులను బస్సు డ్రైవర్ కోరారు. దీంతో తమనే బైక్ తీయమంటావా అంటూ డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగారు. దుర్భాషలాడుతూ డ్రైవర్‌పై దాడి చేశారు. దీంతో పోలీసులకు ఆర్టీసీ డ్రైవర్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు యువకులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed