- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Iran : ఇరాన్ అణుస్థావరాలపై సైబర్ ఎటాక్.. ఇజ్రాయెల్ పనేనా ?
దిశ, నేషనల్ బ్యూరో : ఇరాన్‌పై శనివారం అకస్మాత్తుగా సైబర్ దాడులు జరిగాయి. ఇరాన్ ప్రభుత్వానికి చెందిన న్యాయ, శాసన, కార్యనిర్వాహక విభాగాలతో పాటు అణు స్థావరాల నెట్‌వర్క్‌లపై హ్యాకర్లు విరుచుకుపడ్డారు. ఆయా వెబ్ పోర్టల్స్, ఇంటర్నెట్ నెట్‌వర్క్‌ల నుంచి కీలకమైన సమాచారాన్ని హ్యాకర్లు దొంగిలించినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇరాన్‌లోని ఇంధన సప్లై, మున్సిపల్ సేవలు, రవాణా సేవలు, పోర్టుల వంటి కీలక విభాగాల నెట్‌వర్క్‌లపైనా సైబర్ దాడులు జరిగాయని సమాచారం. ఇరాన్ సైబర్ విభాగం సుప్రీం కౌన్సిల్ మాజీ కార్యదర్శి హసన్ ఫిరౌజాబాదీ ఈవివరాలను తెలియజేశారని ఆయా కథనాల్లో ప్రస్తావించారు. అయితే ఈ దాడులకు పాల్పడింది ఇజ్రాయెలేనా ? అనే దానిపై ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. ఇటీవలే ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్లతో దాడికి పాల్పడింది. దీనికి ప్రతీకారంగానే ఇరాన్‌పై ఇజ్రాయెల్ సైబర్ దాడి చేసి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
అమెరికా సన్నిహిత అరబ్ దేశాలకు వార్నింగ్
ఇరాన్ మరోసారి అమెరికా సన్నిహిత అరబ్ దేశాలకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. పొరపాటున కూడా ఇజ్రాయెల్‌కు సాయం చేయొద్దని వాటికి సూచించింది. ఒకవేళ ఆ దుస్సాహసం చేస్తే తీవ్ర పర్యవసానాలు ఉంటాయని ఇరాన్ అల్టిమేటం ఇచ్చింది. ఈమేరకు సందేశాన్ని రహస్య దౌత్య మార్గాల ద్వారా ఆయా అరబ్ దేశాలకు ఇరాన్ పంపినట్లు తెలుస్తోంది. అమెరికా సైనిక స్థావరాలు కలిగిన సౌదీ అరేబియా, జోర్డాన్, యూఏఈ, ఖతర్ దేశాలకు ఈమేరకు సందేశాన్ని ఇరాన్ చేరవేసినట్లు సమాచారం.