కవితపై ఈడీ విచారణ సరైందే: రేవంత్ రెడ్డి

by S Gopi |
కవితపై ఈడీ విచారణ సరైందే: రేవంత్ రెడ్డి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: గుజరాత్ నుంచి నలుగురు దొంగలు వచ్చారు ఇద్దరు అమ్మేవాళ్లు ఇద్దరు కొనేవాళ్లు అని పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి విమర్శించారు. బుధవారం హాతే సే హాత్ జోడో పాదయాత్రలో భాగంగా నిజామాబాద్ క్యాంప్ లో విలేకరుల సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ డబుల్ ఇంజన్ అంటే అదానీ మోడీ అని, డబుల్ ఇంజన్ ఇప్పుడు ట్రబుల్ ఇంజన్ అయిందని, అదానీ ఇప్పుడు ట్రబుల్ లో ఉన్నాడని తర్వాత ప్రధాని మోడేనన్నారు. అదానీపై హిడెన్ బర్గ్ సంస్థ పరిశోధక కథనం ప్రచురించిందని అన్నారు. అదానీ షేర్ల విలువ విపరీతంగా పెంచి షేర్ మార్కెట్ ను పథకం ప్రకారం పతనం చేశారన్నారు. ప్రపంచ ధనవంతుల్లో 69వ స్థానంలో ఉన్న అదానీ 2021 నాటికి ప్రపంచంలో 3వ స్థానంలో ఉన్నారన్నారు. మోడీ ప్రధాని కాకముందు అదానీ ఆస్తులు రూ. 6 వేల కోట్లు అనీ, మోడీ ప్రధాని అయ్యాక రూ. 11 లక్షల 30 వేల కోట్లు ఆస్తులు పెరిగాయన్నారు. ఎల్ఐసీ, ఎస్ బీఐ సంస్థల నుంచి తనాఖా పెట్టి వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారన్నారు. డొల్లా కంపెనీలను సృష్టించి 10లక్షల కోట్ల రూపాయలు నష్టం రావడంతో చిన్న చిన్న వ్యాపారస్తులు ప్రజలు నష్టపోయారన్నారు.

నిజామాబాద్ జిల్లాకు శ్రీ రాంసాగర్, పోచంపాడ్, మెడికల్ కాలేజీ, జనరల్ హాస్పిటల్, తెలంగాణ యూనివర్సిటీలను కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మంజూరు అయ్యాయన్నారు. యూపీఏ హయంలో వచ్చిన అవినీతి, ఆరోపణలు కుంభకోణాలపై ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలని 2 జీ కుంభకోణం, బొగ్గు గనుల లీజు వ్యవహరం, కామన్ వెల్త్ గేమ్స్ నిర్వహణపై జేపీసీ వేషామని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. హిడేన్ బర్గ్ పరిశోధన సంస్థ తేటతెల్లం చేసిన అదానీకి సంబంధించిన షేర్ పతనంపై జేపీసీ వేసి మోడి చిత్తశుద్దిని నిరూపించుకోవాలన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ లపై కాంగ్రెస్ పార్టీ రూపొందించిన తోడు దొంగలు అనే చార్జీషీట్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బందీపోట్ల రాక్షస సమితిగా బీఆర్ఎస్ ను, భ్రష్ట జూమ్ల పార్టీగా బీజేపీని వర్ణిస్తూ చార్జీషీట్ లో ఉన్న అంశాలను వెల్లడించారు. కామారెడ్డి జిల్లా పర్యటనలో మంత్రి కేటీఆర్ తనపై చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కేసీఆర్ మూడు వేల వైన్స్ లు, 33 వేల బెల్ట్ షాపులు పెట్టి అభివృద్ది చేశారన్నారు. కవితపై ఈడీ విచారణ సరైందేనన్నారు. కరోనా సమయంలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై ఈడీ విచారణ చేపట్టిందని అన్నారు. అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు స్పందించలేదన్నారు.

గలీజ్ గణేష్ ... ఎమ్మెల్యే బిగాల గణేష్ పై కాంగ్రెస్ చార్జీషీట్

హాథ్ సే హాథ్ జోడో పాదయాత్రలో భాగంగా నిజామాబాద్ పర్యటనలో అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తపై గలీజ్ గణేష్ పేరిట కాంగ్రెస్ పార్టీ చార్జీషీట్ విడుదల చేసింది. వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, నగర అధ్యక్షులు కేశ వేణు, అర్బన్ ఇంచార్జి తాహెర్, రాష్ట్ర కార్యదర్శి గడుగు గంగాధర్ తదితరులు పనేదైనా పథకం ఏదైనా నా వాటా 30 శాతం అంటూ ముద్రించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా 9 ఆరోపణలతో కూడిన చార్జీషీట్ ను విడుదల చేశారు. బిగాలను దిగంతాలకు తరుముదాం, నిజామాబాద్ భవిష్యత్తు కాపాడుదామని నినాదాలు చేశారు. బైబై కేసీఆర్ బైబై బిగాల అంటూ ముద్రించిన కరపత్రాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు.

Advertisement

Next Story