- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'రైతుల అభిప్రాయం లేనిది మాస్టర్ ప్లాన్ ఎలా నిర్ణయిస్తారు'
దిశ, కామారెడ్డి : రైతుల భూములు లాక్కునేందుకు ప్రభుత్వానికి అనుమతి ఎవరిచ్చారని రైతుల అభిప్రాయం మేరకే మాస్టర్ ప్లాన్ చేపట్టాలని తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. శనివారం ఆయన అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామానికి చేరుకుని ఆత్మహత్యచేసుకున్న వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇండస్ట్రియల్ జోన్, పంట పొలాల్లోంచి రోడ్లు, గ్రీన్ జోన్ అంటూ వారి పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని ఇండస్ట్రియల్ ఏరియా ఏ ప్రాంతంలో అయితే అనుకూలంగా ఉంటుందో ప్రజాభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. ఆయనతో పాటు ప్రధాన కార్యదర్శి నిజ్జన రమేష్ , నాయకులు కుంభాల లక్ష్మణ్, రజినీకాంత్ తదితరులున్నారు.